Advertisement

Advertisement


Home > Movies - Movie News

పవన్ కు సిఎమ్ కళ వచ్చేసింది

పవన్ కు సిఎమ్ కళ వచ్చేసింది

సిఎమ్ ల కేనా కాన్వాయ్ లు. అదే తరహా కాన్వాయ్ తనకు వుండకూడదా అనుకున్నారేమో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఓ కోటిన్నర ఖర్చుతో ఓ ఎనిమిది కార్ల కాన్వాయ్ రెడీ చేసేసుకున్నారు. 

కొత్త కార్లు ఎనిమిది అంటే సుమారు కోటిన్నర వరకు వ్యయం వుంటుంది కొనుగోలు చేసేసారు. ఈ నల్లటి కాన్వాయ్ చూస్తుంటే పవన్ కు సిఎమ్ కళ వచ్చేసినట్లు కనిపిస్తోంది. 

సాధారణంగా పార్టీ నాయకులు ఓ కార్ లోనే వెళ్తారు. వారి అనుచరులు వివిధ వాహనాల్లో అనుసరిస్తారు. అవి పది కార్లు కావచ్చు. పాతిక కావచ్చు. లేదా ప్రత్యేకమైన కేరవాన్ ను చేయించుకుంటారు. అలాగే యాత్ర పొడవునా ఏర్పాట్లు చేసుకుంటారు.

కానీ పవన్ దీనికి భిన్నంగా ఓ సిఎమ్ మాదిరిగా కాన్వాయ్ రెడీ చేసుకున్నారు. ఎనిమిది నల్ల స్కార్పియో వాహనాలు పార్టీ ఆఫీసుకు వచ్చి చేరాయి. 

ఆరు నెలల టూర్ కు అంతా రెడీ అయిపోయింది. ఇందుకోసం దాదాపు కోటిన్నర ఖర్చు చేసారని బోగట్టా. పార్టీ కోసం పవన్ తనే ఈ వాహనాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఈసారి సిఎమ్ అవకాశం వస్తే అందిపుచ్చుకోవాలని పవన్ కు వుంది. అది సాధ్యం అవుతుందో లేదో కానీ కాన్వాయ్ వచ్చిందంటే ఆ కళ వచ్చేసినట్లే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?