ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

ఇన్నాళ్లూ సలార్ అప్ డేట్స్ తో పండగ చేసుకున్నారు. మధ్యమధ్యలో కల్కి ప్రమోషనల్ మెటీరియల్ తో కూడా పండగ చేసుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కోసం మరో అప్ డేట్ రెడీ అయింది. మారుతి…

ఇన్నాళ్లూ సలార్ అప్ డేట్స్ తో పండగ చేసుకున్నారు. మధ్యమధ్యలో కల్కి ప్రమోషనల్ మెటీరియల్ తో కూడా పండగ చేసుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కోసం మరో అప్ డేట్ రెడీ అయింది. మారుతి సినిమా నుంచి ఫస్ట్ లుక్ రాబోతోంది. ఈ విషయాన్ని మారుతి ఈరోజు ప్రకటించాడు.  

ప్రభాస్-మారుతి కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే అత్యంత గోప్యంగా, ఎలాంటి పిక్స్ లీక్ అవ్వకుండా ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది. చివరికి జానర్ ఏంటి, టైటిల్ ఏంటి లాంటి అంశాలపై కూడా మేకర్స్ స్పందించడం మానేశారు. ఎన్ని కథనాలొచ్చినా, ఎన్ని ఊహాగానాలు చెలరేగినా తమ పని తాము చేసుకుపోతున్నారు.

ఎట్టకేలకు ఈ సినిమా నుంచి అప్ డేట్ రెడీ అయింది. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఈనెల 23న మారుతి సినిమా నుంచి ప్రభాస్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. అయితే కేవలం ఫస్ట్ లుక్ కు మాత్రమే పరిమితమౌతున్నారు. టైటిల్ వగైలా లాంటివేవీ ప్రకటించబోవడం లేదు.

ప్రభాస్ తో చేస్తున్న సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ అనే విషయాన్ని గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో మారుతి ఇప్పటికే బయటపెట్టారు. వంద శాతం ఫన్ ఉంటుందని హామీ ఇచ్చాడు. అదే టైమ్ లో ప్రభాస్ ను ఎనర్జిటిక్ గా, మరింత యంగ్ గా, ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే లుక్ లో చూపించానని కూడా తెలిపాడు. ఇప్పుడా లుక్ బయటకు రాబోతోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. నిధి అగర్వాల్, రిద్ది కుమార్ మిగతా హీరోయిన్లు. 2024 చివర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభాస్ ఇప్పుడిప్పుడే సర్జరీ నుంచి కోలుకుంటున్నాడు. అతడు పూర్తిస్థాయిలో కోలుకున్న వెంటనే, మారుతి సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.