Advertisement

Advertisement


Home > Movies - Movie News

మారుతి వెయిటింగ్ మరింత కాలం?

మారుతి వెయిటింగ్ మరింత కాలం?

దర్శకుడు మారుతి జాక్ పాట్ కొట్టారు. ప్రభాస్ తో సినిమా చేతిలో పడింది. కానీ ఆ సినిమా సెట్ మీదకు ఎప్పుడు వెళ్తుందన్నదే ఇంకా క్లారిటీ లేదు. ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కే మీద వున్నారు. 

ఆదిపురుష్, సలార్ విడుదల చేయాల్సి వుంది. వాటి పనులు, వ్యవహారాలు వుండనే వున్నాయి. వీటన్నింటి గ్యాప్ లో మారుతి సినిమాకు డేట్ లు అడపా దడపా అడ్జ‌స్ట్ చేయాలి. అది ఎప్పుడు అన్నదే క్లారిటీ లేదు.

ప్రభాస్ సినిమాకు స్టార్ కాస్ట్, టెక్నికల్ కాస్ట్ ఇంకా ఫిక్స్ కావాల్సి వుంది. ఇప్పటికే ఈ వ్యవహారాలు ముందుకు వెళ్లి వుండేవి కానీ దర్శకుడు మారుతికి పితృవియోగం కారణంగా వీటి మీద దృష్టి పెట్టలేదు. 

ప్రభాస్ కు సమయం చిక్కాలి. మారుతి కలవాలి. అప్పుడే టెక్నికల్ కాస్ట్, స్టార్ కాస్ట్ డిసైడ్ కావాలి. కానీ మళ్లీ డేట్ ల సమస్య తేలకుండా కాస్టింగ్ ఫిక్స్ చేయడం సాధ్యం కాదు.

ఈ డేట్ ల అలాట్ మెంట్ విషయంలోనే ప్రభాస్ కు ఇంకా క్లారిటీ లేదని, అది తేలే వరకు ఈ ప్రాజెక్ట్ వెయింటింగ్ లో వుండాల్సిందే అని తెలుస్తోంది. వన్స్ డేట్ ల మీద క్లారిటీ వస్తే మిగిలిన పనులు చకచకా ముందుకు కదులుతాయి. 

అదెప్పుడు వస్తుందన్నదే తెలియదు. ఈలోగా మారుతి తన పక్కా కమర్షియల్ విడుదల పనుల మీద బిజీ అవుతారేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?