విష్వక్ సేన్ ‘అశోకవనంలో అర్ఙున కళ్యాణం’ సినిమాలో హీరోయిన్ ఎవరు అంటే రుష్కర్ థిల్లాన్ అంటారు టక్కున. సినిమా పబ్లిసిటీ మొత్తం విష్వక్ సేన్, రుష్కర్ చుట్టూనే తిరిగింది. కానీ ఈ రోజు సినిమా విడుదలయ్యాక, దానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంతా మరో అమ్మాయి కొట్టుకుపోయింది.
ఆ అమ్మాయి పేరు కూడా జనాలకు పెద్దగా తెలియదు. సినిమాలో సెకెండ్ హీరోయన్ అనుకుంటే క్లయిమాక్స్ వేళకు మెయిన్ హీరోయిన్ అయిపోయింది. అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపించిన ఈ అమ్మాయినే ఇప్పుడు సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది.
ఆ అమ్మాయి పేరు రుతిక నాయక్. సినిమా చూసిన వాళ్లు ఈ అమ్మాయికి పాతికేళ్లు అంటే నమ్మరు. పదహారో, పద్దెనిమిదో అనుకుంటారు. అంత థిన్ పర్సనాలిటీతో, ఆకట్టుకునే నటనతో కనిపించింది సినిమాలో. రుతిక నాయక్ ను సినిమాలో చూసిన వారంతా టాలీవుడ్ చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు మరో హీరోయిన్ దొరకింది అంటున్నారు.
ఇప్పటి వరకు రుతికను సినిమా యూనిట్ మీడియా ముందుకు తీసుకురాలేదు. అసలు మరో హీరోయిన్ వుందన్న దిశగా ప్రచారమే జరగలేదు. మరి సినిమా కు రుతిక ఇప్పుడు పాజిటివ్ పాయింట్ గా మారింది కనుక, ఇప్పటికైనా ఆమెను సెంటర్ గా పెట్టి ప్రచారం చేస్తారేమో? చూడాలి.