డెడ్ చీప్: నష్ట పరిహారం రూ.25 కోట్లు మాత్రమే

ఊహించని విధంగా విజయ్ నటించిన మాస్టర్ మూవీ రిలీజ్ కు ఒక్క రోజు ముందు లీక్ అయిన సంగతి తెలిసిందే. అదేదో ఒక సీన్ లేదా ఒక సాంగ్ కాదు. ఏకంగా ఫస్టాఫ్ మొత్తం…

ఊహించని విధంగా విజయ్ నటించిన మాస్టర్ మూవీ రిలీజ్ కు ఒక్క రోజు ముందు లీక్ అయిన సంగతి తెలిసిందే. అదేదో ఒక సీన్ లేదా ఒక సాంగ్ కాదు. ఏకంగా ఫస్టాఫ్ మొత్తం (దాదాపు గంట 35 నిమిషాలు) లీక్ అయింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, విజయ్ ఫ్యాన్స్ సహకారంతో లీక్ చేసిన ఆ వ్యక్తిని పట్టుకున్నారు.

విదేశాలకు మాస్టర్ కంటెంట్ ను ట్రాన్సఫర్ చేసేందుకు ఓ డిజిటల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది యూనిట్. ఆ కంపెనీ నుంచే మాస్టర్ మూవీ లీక్ అయిన విషయాన్ని పోలీసులు నిర్థారించారు. 

ఇప్పుడా సంస్థపై లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నారు మాస్టర్ నిర్మాతలు. నష్టపరిహారం కింద 25 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందిగా లీగల్ నోటీసు ఇచ్చారు. నిజానికి ఈ లీకేజీకి పాతిక కోట్ల రూపాయలంటే చాలా తక్కువ. 

కాపీరైట్ చట్టం ప్రకారం.. నిర్మాణ వ్యయాన్ని కూడా కలిపి దాదాపు 70 కోట్ల రూపాయల వరకు పరిహారం కోరవచ్చు. కానీ మాస్టర్ నిర్మాతలు మాత్రం చాలా తక్కువ డిమాండ్ చేశారంటూ.. విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

గంటకు పైగా సినిమాను లీక్ చేసి, తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసిన సంస్థపై పాతిక కోట్ల రూపాయలకు దావా వేయడం చాలా తక్కువంటున్నారు. ఈ సంగతులు పక్కనపెడితే.. ఇలాంటి నష్టపరిహారం వ్యవహారాలు వర్కవుట్ అయిన దాఖలాలు చాలా తక్కువ. 

ఇలాంటివన్నీ లీగల్ గా కాకుండా, తెరవెనక సెటిల్ మెంట్లుగా మారిపోతుంటాయి. ప్రస్తుతం సదరు డిజిటల్ సంస్థ కూడా ఈ పని మీదే ఉంది. తమకున్న పరిచయాలతో ఏకంగా విజయ్ తోనే లాబీయింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. 

ఆ ముగ్గురూ ముగ్గురే

రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్

కామెడీ చెయ్యడం కామెడీ కాదు