రోడ్డు మీద సవారీ అంటే హుషార్ రావాలి. అలాంటి రోడ్లు అభివృద్ధికి గీటు రాళ్ళు. ఏపీలో ఈ మధ్యన విపక్షాలు చేసే విమర్శలలో రోడ్ల గురించి కూడా ఎక్కువగా ప్రస్థావనకు వస్తోంది.
జగన్ సీఎం అయ్యాక విస్తారంగా కురిసిన వానలకు రాష్ట్రలో చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. దానికి తోడు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు కూడా వందల కోట్లలో ఉన్నాయి.
ఈ నేపధ్యంలో అన్ని లెక్కలూ సరి చూసుకుని రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి వైసీపీ సర్కార్ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ ఆధీనంలో ఉన్న దాదాపుగా 46 వేల కిలోమీటర్ల రోడ్లకు మహర్దశ కలగనుంది.
అద్దాల మాదిరిగా జిగెల్మైనించేలా రోడ్లను చూడబోతున్నారంటూ మంత్రి శంకర్ నారాయణ తాజాగా శుభవార్త వినిపించారు. ఆరు వేల కోట్ల రూపాయల న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో ఈ రోడ్లను అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు.
ఇక ప్రత్యేకించి విశాఖ నగరం సుందరీకరణకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని మంత్రి చెప్పారు. అందమైన రోడ్లు కూడా అభివృద్ధిలో భాగమని ఆయన అంటూ విశాఖలో బ్యూటిఫికేషన్ కి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
మొత్తానికి వైసీపీ సర్కార్ రోడ్ల అభివృద్ధికి నడుం బిగిస్తే మాట్లాడేందుకు విపక్షానికి నో చాన్స్ అన్న మాటేగా.