ఓ చిన్న, క్యూట్, రొమాంటిక్ విడియో బిట్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది లవ్ స్టోరీ సినిమా. చైతూ-సాయిపల్లవిలతో దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా తరువాత చేస్తున్న సినిమా. ఈ సినిమా ఏప్రియల్ 14న విడుదల అని వినిపించింది. కానీ వాయిదా పడుతుందనే వార్తలు కూడా వినిపించాయి. ఈ సినిమా రాదు అనే ఆలోచనతోనే అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో తయారవుతున్న బ్యాచులర్ సినిమాను చకచకా రెడీ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో చైతూ-సాయిపల్లవిల లవ్ స్టోరీకి మే నెలలో రెండు డేట్ లు సెమీ ఫైనల్ లిస్ట్ లొకి చేర్చారు. మే 9 లేదా మే 29 న విడుదల చేయాలని నిర్మాత ఆసియన్ సునీల్ భావిస్తున్నారు. మే 9 అయితే బెటర్ అనే ఆలోచన దర్శకుడు శేఖర్ కమ్ములలో వుంది. కానీ మే 29 అన్ని విధాలా బాగుంటుందని, డిస్ట్రిబ్యూషన్ రంగంలో బోలెడు అనుభవం వున్ననిర్మాత సునీల్ చెబుతున్నారు.
అందువల్ల మే 29 ఫిక్స్ కావడానికి అవకాశం వుంది. పైగా అప్పటికి చాలా సినిమాలు అయిపోతాయి. ఈ కరోనా వైరస్ గడబిడ కూడా కాస్త తగ్గే అవకాశం వుంటుంది అని కూడా లెక్కలు వేస్తున్నారు.