బంపరాఫర్ అందుకున్న హీరోయిన్

మీనాక్షి చౌదరి.. చిన్నగా కెరీర్ స్టార్ట్ చేసింది ఈ చిన్నది. ఇంకా చెప్పాలంటే మొదటి 2 సినిమాలు డిజాస్టర్లు. అయినప్పటికీ నిరాశ చెందలేదు. తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. హిట్-2 సినిమా సక్సెస్ తో…

మీనాక్షి చౌదరి.. చిన్నగా కెరీర్ స్టార్ట్ చేసింది ఈ చిన్నది. ఇంకా చెప్పాలంటే మొదటి 2 సినిమాలు డిజాస్టర్లు. అయినప్పటికీ నిరాశ చెందలేదు. తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. హిట్-2 సినిమా సక్సెస్ తో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ను ఎట్రాక్ట్ చేసింది. ఎంతలా అంటే.. ఏకంగా మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఇప్పుడీ ముద్దుగుమ్మ మరో బంపరాఫర్ అందుకుంది.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన నటించే అవకాశం కొట్టేసింది మీనాక్షి చౌదరి. త్వరలోనే వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు విజయ్. ఈ సినిమాలో మీనాక్షిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా.

రష్మిక లాంటి హీరోయిన్లకు కూడా నిరూపించుకున్న తర్వాతే అవకాశాలిచ్చాడు విజయ్. అలాంటిది మీనాక్షి చౌదరికి మాత్రం వెంటనే ఛాన్స్ దొరికేసింది. ఈ బ్యూటీకి ఇది చాలా పెద్ద ఆఫర్. ఎందుకంటే, విజయ్ సరసన నటిస్తే కోలీవుడ్ లో క్రేజ్ మామూలుగా ఉండదు మరి.

ప్రస్తుతం ఈ బ్యూటీ, మహేష్ బాబు సరసన గుంటూరుకారం సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటిస్తోంది. అటు విశ్వక్ సేన్, వరుణ్ తేజ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు విజయ్ సినిమా ఆఫర్ తో ఈమె కెరీర్ ఊపందుకున్నట్టయింది.