రాసలీలల, వివాదాస్పద స్వామి నిత్యానందపై మరో నటి మనసు పారేసుకున్నారు. ప్రస్తుతం ఆ స్వామి ఉన్న కైలానికి వెళ్లాలనుకుంటున్నట్టు నటి మీరామిథున్ తన మనసులో దాగి ఉన్న ప్రేమను బహిరంగంగా వ్యక్తపరిచారు. గతంలో నిత్యానందతో ప్రముఖ నటి రంజిత రాసలీలల్లో మునిగి ఉన్న వీడియోలు లీక్ అయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వీడియోలపై బెంగళూరులోని రామ్నగర్ జెఎంఎఫ్సి కోర్టు విచారణ చేపట్టింది.
విచారణలో భాగంగా నిత్యానందకు రక్త, స్వర పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అప్పట్లో సీఐడీ అధికారులు రాసలీలల నిగ్గు తేల్చేందుకు కేసు నమోదు చేశారు. దీంతో ఆ వీడియోల్లో ఉన్నది నిత్యానంద, రంజిత అవునా? కాదా? అని నిగ్గు తేల్చేందుకు కోర్టు విచారణ చేపట్టడం తెలిసిందే.
నిత్యానంద గురించి అన్నీ తెలిసి కూడా ఆయన్ను నటి మీరా మిథున్ వెనకేసుకు రావడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. నిత్యానందను నటి మీరా ట్విటర్ వేదికగా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అందరూ ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఆయనపై తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో తాను నిత్యానంద ఏర్పాటు చేసిన కైలాస దేశానికి వెళ్లాలని కోరుకుంటున్నట్టు మీరా ప్రకటించి సంచలనం సృష్టించారు. లాట్స్ ఆఫ్ లవ్ అని మీరా మిథున్ పేర్కొనడం విశేషం.