గత వారంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా మెగాస్టార్ చిరంజీవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తనదైన శైలిలో మంత్రి రోజా పేరు ఎత్తకుండా గట్టి కౌంటర్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. త్వరలో మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదల సందర్భంగా గ్రేట్ ఆంధ్ర తో మాట్లాడారు మెగాస్టార్ చిరంజీవి.
గతంలో రోజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ… 'సాధారణంగా నటీనటులకు సెన్సిటివ్, ఎమోషనల్‌గా ఉంటారు. ఎమ్జీఆర్, జయలలిత, ఎన్టీఆర్ వంటి దిగ్గజాలు ప్రజల నుండి చాలా గౌరవం పొందారు. కానీ చిరు, పవన్, నాగబాబులకు ఎలాంటి ఎమోషన్స్ లేవు అందుకే ముగ్గురు అన్నదమ్ములను సొంత నియోజకవర్గాల్లోనే ప్రజలు తిరస్కరించారన్నారు' దీనిపై ఇప్పటికే నాగాబాబు తన దైన కౌంటర్ కూడా ఇచ్చారు.
తాజాగా గ్రేట్ ఆంధ్ర ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఇన్ని రోజులు నాతో స్నేహంగా ఉండి, నా సహాయం తీసుకోని, సహాయం కోసం నా ఇంటికి వచ్చినా వారు కూడా నేను ఎటువంటి సహాయం చేయలేదంటున్నారు. నేను ఎవరికి సహాయం చేశానో నాకు తెలుసు.. నా సహాయం తీసుకున్నవారికి తెలుసు. నా గురించి తెలిసి మాట్లాడారో లేక తెలియక మాట్లాడారో తెలియదుకాని.. అలాంటి వారిని కేర్ చేయనని వారిని పటించుకోనన్నారు. నా పేరు వాడకపోతే వారికి మనుగడ ఉండదనే నా గురించి మాట్లాడుతున్నారంటూ” మెగా స్టైల్ కౌంటర్ ఇచ్చారు.
ఒకప్పుడు నా గురించి నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే బాధపడేవాడిని కానీ ఇప్పుడు అటువంటి మాటలు పట్టించుకోవడం లేదన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ తన తమ్ముళ్ల దారి తమ్ముళ్లది.. తన దారి తనదన్నారు. అల్లు అరవింద్ కుటుంబంతో ఎటువంటి గొడవలు లేవని ఎవరి దారి వారు చూసుకోవడంలో తప్పులేదన్నారు.