ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు జిల్లా కోర్టు షాక్ ఇచ్చింది. అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని పోలీసులను జిల్లా కోర్టు ఆదేశించింది.
అంబటి రాంబాబు నియోజకవర్గం సతైనపల్లిలో వైసీపీ నేతలు సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో ఆక్రమ వసూళ్లకు పాలడ్డారని ఆరోపిస్తూ జనసేన నేతలు సతైనపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేసిన.. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో జనసేన నేతలు కోర్టుకెళ్లారు. దీంతో అంబటిపై కేసు నమోదు చేయాలని గుంటూరు జిల్లా కోర్టు పొలీసులను ఆదేశించింది.
గతంలో కూడా మంత్రి అంబటి రాంబాబు తన నియోజకవర్గంలోని ఓ బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చిన సాయం నుంచి లంచం అడిగారని అరోపణలు మారవక ముందే మరో తీవ్ర అరోపణలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఏ మంత్రిపై కూడా పదేపదే అరోపణలు రావడం లేదు కాని అంబటి రాంబాబు మంత్రి కాక ముందు నుండి కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి.
బహుశా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై నిత్యం గట్టి కౌంటర్లు ఇవ్వడంతో ఇటువంటి అరోపణలు వస్తున్నాయంటున్నారు వైసీపీ నేతలు.