మా ఎన్నికలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. దీని పరమార్థం ఏమిటై వుంటుందని గుసగుసలు మొదలయ్యాయి.
మా ఎన్నికల బరిలో వున్న మంచు విష్ణు, ఆంధ్ర సిఎమ్ వైఎస్ జగన్ కు సమీప బంధువు. అందువల్ల సహజంగానే వైకాపా మద్దతు వుందనే ప్రచారం మొదలయింది.
ఇలాంటి టైమ్ లోనే మంచు విష్ణు కనుక ఓడిపోతే సినిమారంగం కోరుకునే రేట్లు వగైరా ఇచ్చేది లేదు అంటూ జగన్ హుకుం జారీ చేసారనే ఫేక్ ప్రచారం ఒకటి ప్రారంభమైంది. దీన్ని అత్యవసరంగా ఖండించాల్సిన అవసరం పడింది. ఆ మేరకే మంత్రి ఆ ప్రకటన చేసి వుండొచ్చు.
కానీ ఇక్కడే మరో గుసగుస వినిపిస్తోంది. మంత్రి పేర్ని నాని వైకాపాలో వున్నా కూడా మెగా క్యాంప్ అంటే మా చెడ్డ అభిమానం అనే గుసగుస అది. ప్రకాష్ రాజ్ మెగా మద్దతుతో పోటీలో వున్న సంగతి తెలిసిందే.
వైకాపా మద్దతు వున్నా లేకున్నా, ఆ ప్రచారం కారణంగా కొన్ని ఓట్లు అయినా మంచు విష్ణుకు పడే అవకాశం వుంది. అలా మద్దతు లేదు అని స్పష్టంగా ప్రకటిస్తే వ్యవహారం వేరుగా వుంటుంది.
అందుకే మెగా ఎత్తుగడలో భాగంగానే మంత్రి చేత ఈ ప్రకటన చేయించారనే గుసగుస కూడా వినిపిపిస్తోంది. ప్రకాష్ రాజ్ ను గెలిపించడం కోసం చిరంజీవి తెరవెనుక కృషి చేస్తున్నారనే టాక్ వుంది.
మా ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ కమ్మ-కాపు వర్గాలుగా చీలిపోయిందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.