మెగా ఫ్యాన్స్ ఆవేదన..ఆందోళన

పండగ సినిమాలు దగ్గర పడుతున్నాయి. నందమూరి..మెగా సినిమాలకు పబ్లిసిటీ పోటా పోటీ గా జరుగుతోంది. దేనికీ తక్కువ కాకుండా చూసుకుంటున్నారు నిర్మాతలు. ఎక్కడ ఫ్యాన్స్ తో ఇబ్బంది వస్తుందో అని వీలయినంత జాగ్రత్తగా వెళ్తున్నారు.…

పండగ సినిమాలు దగ్గర పడుతున్నాయి. నందమూరి..మెగా సినిమాలకు పబ్లిసిటీ పోటా పోటీ గా జరుగుతోంది. దేనికీ తక్కువ కాకుండా చూసుకుంటున్నారు నిర్మాతలు. ఎక్కడ ఫ్యాన్స్ తో ఇబ్బంది వస్తుందో అని వీలయినంత జాగ్రత్తగా వెళ్తున్నారు. అయినా మెగా ఫ్యాన్స్ లో అసంతృప్తి పోవడం లేదు. ఆవేదన తగ్గడం లేదు. ఈ రోజు బేగంపేట టూరిజం ప్లాజా హొటల్ లో సుమారు 400 మంది మెగా ఫ్యాన్స్ సమావేశమయ్యారు. మైత్రీ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ ఈ సమావేశానికి హాజరయ్యారు.

మెగాస్టార్ సినిమా ప్రచారం విషయంలో శ్రద్ద పెట్టడం లేదు అన్నది ఫ్యాన్స్ ప్రధాన ఆరోపణ. మెగాస్టార్ పాటను థియేటర్లలో లాంచ్ చేయమని అడిగామని, కానీ చేయలేదని, ఇప్పుడు బాలకృష్ణ పాటను మాత్రం థియేటర్లో విడుదల చేసారని ఫ్యాన్స్ వివరించారు.

థియేటర్ల విషయంలో ఇంకా క్లారిటీ లేదని చాలా చోట్ల వారసుడు, వీరసింహారెడ్డికి మంచి థియేటర్ల పడుతున్నాయని కొందరు తెలిపారు. మెగాస్టార్ సినిమాకు ఏం చేస్తే బాగుంటుదని తాము అనుకుంటున్నామో, అవన్నీ బాలయ్య సినిమాకు అమలు అవుతున్నాయని ఫ్యాన్స్ వివరించారు.

ఫ్యాన్స్ కు మైత్రీ రవి సమాధానం ఇస్తూ, సినిమా అద్భుతంగా వచ్చిందని, ఇంద్ర లాంటి రేంజ్ సినిమా అని, పబ్లిసిటీ, థియేటర్ల ప్లానింగ్ పై ఫ్యాన్స్ కు ఆందోళన అవసరం లేదని, తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. మెగా ఫ్యాన్స్ ఓ బ్లాక్ బస్టర్ సినిమా అందిస్తున్నామని ఆయన స్పష్టం చేసారు.