Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఆర్కే నోట బాబు ఆలోచన!

ఆర్కే నోట బాబు ఆలోచన!

‘’..చంద్రబాబు మళ్లీ తెలంగాణ రాజకీయాల వైపు చూడటం ద్వారా పాత తప్పునే మళ్లీ చేస్తున్నారా? అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నవారూ లేకపోలేదు. ఈ అభిప్రాయంలో హేతుబద్ధత ఉందా? లేదా? అన్న విషయం పక్కన పెడితే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ ఓట్లు ఉన్నాయన్నది మాత్రం వాస్తవం. ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి గెలవడానికి మాత్రం ఈ ఓట్లు సరిపోవు. ..’’

‘’…తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించాలంటే ప్రస్తుత పరిస్థితులలో బీజేపీ బలం సరిపోదు. తెలుగుదేశం పార్టీతో పాటు షర్మిల, ప్రవీణ్‌ కుమార్‌ సహకారం కూడా తీసుకోగలిగితేనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మూడు పార్టీల వల్ల ప్రధానంగా నష్టపోయేది బీఆర్‌ఎస్‌ మాత్రమే…’’

‘’..2018 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో నిస్తేజంగా ఉండిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అధికారం కోల్పోవడంతో చంద్రబాబు కూడా తెలంగాణను పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపించడంతో తెలంగాణలో తన పార్టీని పునరుద్ధరింపజేయడానికి ఆయన ప్రయత్నాలు మొదలెట్టారు…’’

సీనియర్ జర్నలిస్ట్ ఆర్కే రాసిన వ్యాసం లోని ఈ రెండు పేరాలు చదివితే చాలు, తెలుగుదేశం పార్టీ ఆలోచన ఏమిటి? వెళ్లాలనుకుంటున్న దారి ఏమిటి అన్నది క్లారిటీగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తనకు ఇంకా వున్నాయి అని భావిస్తున్న ఓట్లను కాస్త ఇబ్బడి ముబ్బడిగా చూపించి, భాజపాను భ్రమింపచేసి, ఆంధ్రలో సహాయం కోసం వాటిని బార్టర్ సిస్టమ్ లో అందించే ప్రయత్నం చేస్తోంది అన్నది వాస్తవం. దానికి రీజన్ గా ఆర్కే చెప్పింది ఏమిటంటే, తేదేపాకు తెలంగాణలో ఓట్లు వున్నాయి కానీ అవి ఒంటరిగా పోటీ చేసి గెలవడానికి చాలవు అని.

అలాగే కేసిఆర్ ను గద్దె దించాలంటే ఆంధ్రలో తేదేపా అమలు చేయాలనుకుంటున్న ఫార్ములానే ఇక్కడా అమలు చేయాలన్నది. జగన్ ను దింపడం కోసం భాజపా, జనసేన, వామపక్షాలు, ఇంకా ఇంకా పార్టీలతో తేదేపా కలిసి పోటీ చేయాలనుకుంటోంది. ఇప్పుడు ఇదే సలహాను తెలంగాణలో భాజపాకు వయా ఆర్కే ద్వారా అందిస్తోంది. ప్రవీణ్ కుమార్..షర్మిల..బాబు కలిసి భాజపాకు అండగా వుంటే కేసిఆర్ పని అయపోయినట్లే అంటూ రాస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ మీకు మేము..అక్కడ మాకు మీరు అనే ఫార్ములాను ఎలాగైనా భాజపా నాయకుల మెదళ్లలోకి చొప్పంచాలని చూస్తున్నారు.

వెనకటికి ఓ సామెత వుంది. నువ్వు పేలాలు పట్టుకురా..నేను ఊక తెస్తా..రెండూ కలిపేసి, ఊదుకు తిందాం అని. అసలు ఊక కలపడం ఎందుకు ఊదుకు తినడం ఎందుకు..అవతలి వాడి పేలాలు తెలివిగా కొట్టేయడం కోసం తప్ప. ఇప్పుడు చంద్రబాబు ఆలోచన అదే. తెలంగాణలో తనకు లేని బలగాన్ని చూపించి, భాజపా దోస్తీని ఆంధ్రలో కొట్టేయాలన్నది మాస్టర్ ప్లాన్.

అందుకోసం తెలంగాణలో తేదేపా సైకిల్ కు గాలి కొట్టడం, కొట్టించడం ప్రారంభించారు. అందులో భాగంగా తమకు ‘సామాజిక’ పట్టు వున్న ఖమ్మం ప్రాంతంలో తొలి ప్రచారం ప్రారంభించారు. కేసిఆర్ కు భయపడి తేదేపాకు దూరంగా వున్న నాయకులు తెరవెనుక నుంచి చంద్రబాబుకు సాయం అందించారని వార్తలు వున్నాయి. ఇప్పుడు ఇది స్టేక్ గా పణం ఒడ్డి భాజపా మైత్రిని గెలవాలన్నది చంద్రబాబు ఆలోచన. అది ఎవరో అంటున్న మాట కాదు. తన వ్యాసంలో ఆర్కే నే చెప్పిన మాట.

కానీ భాజపా మరీ అంత తెలివి తక్కువగా బోల్తా పడుతుందా? ఇప్పటికి బాబుతో దోస్తీకి దిగి ఎన్ని పార్టీలు తరువాత భంగపాటుకు గురి కాలెేదు? మొన్నటికి మొన్నే కదా తెలంగాణలో కాంగ్రెస్ తో చేతులు కలిపింది. ఇప్పుడు భాజపాతో సై అంటోంది. రేపు ఎప్పుడో మరోసారి తెరాసకు జై అన్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే చంద్రబాబుకు అప్పటికి ఏది అవసరమో దాని వెంట వెళ్లడానికి అస్సలు మొహమాటపడరు. తన అధికార సాధన తప్ప మరేదీ ఆయనకు పట్టదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?