ర‌ష్మిక యాడ్.. హేట‌ర్స్ కు మ‌ళ్లీ ప‌ని!

అభిమానుల‌ను, స్టార్ డ‌మ్ ను, భారీ పారితోషికాల స్థాయిని అందుకోవ‌డ‌మే కాదు.. ఇదే స‌మ‌యంలో త‌న‌కు కావాల్సినంత‌మంది హేట‌ర్స్ ను కూడా సంపాదించుకుంది ర‌ష్మిక‌! ఆమె స‌క్సెస్ చాలా మందికి న‌చ్చ‌లేదు. ఆమె సొంత…

అభిమానుల‌ను, స్టార్ డ‌మ్ ను, భారీ పారితోషికాల స్థాయిని అందుకోవ‌డ‌మే కాదు.. ఇదే స‌మ‌యంలో త‌న‌కు కావాల్సినంత‌మంది హేట‌ర్స్ ను కూడా సంపాదించుకుంది ర‌ష్మిక‌! ఆమె స‌క్సెస్ చాలా మందికి న‌చ్చ‌లేదు. ఆమె సొంత రాష్ట్రం క‌ర్ణాట‌క‌లోనే ఆమెను ఈ ర‌కంగా ద్వేషించే వారెక్కువ‌! ఇక ఎందుకో రైట్ వింగ్ వీరావేశులు కూడా ర‌ష్మిక‌ను హేట్ చేసేస్తారు. ఇక రిష‌బ్ షెట్టి సాధించిన స‌క్సెస్ ఆమెకు రీవేంజ్ అన్న‌ట్టుగా చిత్రీక‌రిస్తున్నారు. అత‌డి ప‌ని అత‌డిది, ఆమె ప‌ని ఆమెది. అయితే మ‌ధ్య‌లో జ‌నాల‌ది మాత్రం బాగా హ‌డావుడి!

ఇక ర‌ష్మిక యాడ్స్ కూడా గ‌తంలో ట్రోల్ కు గుర‌య్యాయి. ఆ మ‌ధ్య ఒక హిందీ యాడ్ లో ఆమె విక్కీ కౌశ‌ల్ అండ‌ర్ వేర్ మీద చూపును నిలిపే యాడ్ బాగా విమ‌ర్శ‌ల పాల‌య్యింది. మగ‌వాళ్ల అండ‌ర్ వేర్ బ్రాండ్ ప్ర‌మోష‌న్ యాడ్ లో ర‌ష్మిక ద‌ర్శ‌కుడు చెప్పిందే చేసి ఉండ‌వ‌చ్చు! ఆ యాడ్ ఆ కంపెనీ, దాని రూప‌క‌ర్త‌ల చీప్ టేస్ట్ కు నిద‌ర్శ‌నం. ఇండియాలో మ‌గ‌వాళ్ల అండ‌ర్ వేర్ యాడ్ ల త‌ర‌హానే అలా ఉంటుంది. అయితే ఆ యాడ్ లో న‌టించినందుకు ర‌ష్మిక బాగా విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొనాల్సి వ‌చ్చింది. డ‌బ్బు చూసుకుని సెల‌బ్రిటీలు అలా కామ్ గా ఉండ‌వ‌చ్చు!

ఇక తాజాగా ఒక మ‌ద్యం కంపెనీ యాడ్ లో కూడా ర‌ష్మిక క‌నిపిస్తోంది. ఇండియ‌న్ హీరోయిన్ల‌లో ఇది కొత్తేమీ కాదు. గ‌తంలో ప్రియాంక చోప్రా, దీపిక‌తో స‌హా అనేక మంది హీరోయిన్లు మ‌ద్యం బ్రాండ్ల‌ను ప్ర‌మోట్ చేసే యాడ్స్ లో క‌నిపించారు. స‌మంత కూడా ఒక లిక్క‌ర్ బ్రాండ్ ను ప్ర‌మోట్ చేసింది. ఇప్పుడు రష్మిక వంతు వ‌చ్చిన‌ట్టుగా ఉంది. మ‌ద్యం యాడ్ ల‌లో న‌టించే హీరోలు కూడా బోలెడంత‌మంది ఉన్నారు. వారంతా స్టార్లే. వారిని ఏమ‌న‌రు కానీ.. హీరోయిన్లు మ‌ద్యం బ్రాండ్ ప్ర‌మోష‌న్ యాడ్స్ లో క‌నిపిస్తే విమ‌ర్శ‌లు మామూలే!

అస‌లే ర‌ష్మిక‌కు ఈ త‌ర‌హా హేట్ క్యాంపెయిన్లు ఎక్కువ‌. ఇలాంటి నేప‌థ్యంలో కూడా ర‌ష్మిక ధైర్యంగానే మ‌ద్యం బ్రాండ్ ను ప్ర‌మోష‌న్ యాడ్ లో చేసింది. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకునే లెక్క‌ల‌తో ఆమె విమ‌ర్శ‌ల‌ను లెక్క చేయ‌కుండా సాగుతున్న‌ట్టుగా ఉంది.