“సీతారామరాజు బాగా చదువుకుంటాడు. బ్రిటిషర్ల రూలింగ్ లో, వాళ్లకు అనుకూలంగా ఉద్యోగం చేస్తున్నప్పటికీ, సక్రమంగా లీగల్ పద్ధతుల్లో దేశానికి స్వతంత్రం తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ భీమ్ మాత్రం యుద్ధంతోనే స్వతంత్రం వస్తుందని నమ్ముతాడు.
తన తండా జనాలకు యుద్ధరీతులు నేర్పుతూ, గొరిల్లా దాడులతో ఇండిపెండెన్స్ కోసం ప్రయత్నిస్తుంటాడు. ఒక దశలో కొమరం భీమ్ ను రామ్ చరణ్ అరెస్ట్ చేస్తాడు. అయితే తర్వాత జరిగిన పరిణామాలతో సీతారామరాజు-భీమ్ కలుస్తారు.”
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి 2 రోజులుగా ఈ స్టోరీలైన్ చక్కర్లు కొడుతోంది. ఇక్కడ మేం బ్రీఫ్ గా 4 వాక్యాల్లో చెప్పా కానీ, సోషల్ మీడియాలో మాత్రం దాదాపు 2 పేజీల కథ తిరుగుతోంది. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్.. ఇలా అంతా విడమర్చి ఉంది.
దీంతో చాలామంది ఇదే అసలైన ఆర్ఆర్ఆర్ కథ అనుకుంటున్నారు. పైగా ఆల్రెడీ రిలీజైన ఎన్టీఆర్, చరణ్ టీజర్లలోని విజువల్స్ కు ఈ కథకు అక్కడక్కడ పోలికలు కూడా కలవడంతో సదరు కథకు చాలామంది ఫిక్స్ అయిపోయారు.
ఎన్నో గాసిప్స్ లో ఇది కూడా ఒకటి. అందుకే ఆర్ఆర్ఆర్ యూనిట్ లైట్ తీసుకుంది. కానీ ఈసారి ఈ పుకారును ఖండించే బాధ్యతను మెగా ఫ్యాన్స్ తీసుకున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథకు, సినిమాకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు ఫ్యాన్స్. ఆశ్చర్యంగా తారక్ అభిమానులు మాత్రం ఈ కథను బాగా వైరల్ చేస్తున్నారు.