Advertisement

Advertisement


Home > Movies - Movie News

మెగాహీరోల వల్ల కానిది

మెగాహీరోల వల్ల కానిది

సితార సంస్థలో మెగా హీరో పవన్ కళ్యాణ్ తో భీమ్లానాయక్ సినిమా నిర్మించారు. అలాగే మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ సినిమా నిర్మించారు. కానీ లాభాలు కళ్ల చూడలేకపోయారు. పవన్ తో భారీ సినిమా తీసినా, వైష్ణవ్ తో మిడ్ రేంజ్ సినిమా తీసినా పెద్దగా తేడా లేదు. పవన్ సినిమా వల్ల బయ్యర్లకు మిగిలింది లేదు. ఆదికేశవ సినిమాతో నిర్మాతలకు మిగిలిందీ లేదు. మరో మెగా హీరో సినిమా ప్లానింగ్ లో వుంది కానీ అది వుంటుందో, వుండదో తెలియని పరిస్థితి.

అలాంటిది ఏ బ్యాకింగ్ లేని, జస్ట్ రెండు మూడు సరైన ప్రాజెక్టులు వున్న హీరో సిద్దుతో మాత్రం రెండో బ్లాక్ బస్టర్ కొట్టేసింది సితార సంస్థ. పైగా ఇలాంటి అలాంటి హిట్ లు కాదు. పెట్టుబడికి లాభాలకు మధ్య ఎక్కువ పాజిటివ్ గ్యాప్ వున్న సినిమాలు ఈ రెండూ. ఉదాహరణకు నైజాం ఏరియాలో టిల్లు పార్ట్ వన్ 7 కోట్లు వసూలు చేస్తే, రెండో భాగాన్ని అదే ఏడు కోట్లకు విక్రయించారు. ఇప్పుడు ఈ రెండో భాగం 15 కోట్లకు పైగా వసూళ్లు సాగిస్తుందని అంచనా.

పవన్ కు 50 కోట్లకుపైగా రెమ్యూనిరేషన్ ఇచ్చిన భీమ్లా నాయక్ ఈ రేంజ్ లాభాలు పండించలేదు. ఆదికేశవ అయితే డిజాస్టార్ టాక్ మూటకట్టుకుంది. మళ్లీ ఈ మధ్యలోనే తమిళ హీరో ధనుష్ తో సర్ సినిమా తీస్తే లాభాలు వచ్చాయి. చిన్న హీరోలతో మ్యాడ్ సినిమా దాని రేంజ్ వరకు తెచ్చిపెట్టింది.

సరైన కాన్సెప్ట్, ఎంటర్ టైన్ మెంట్, డైరక్టర్ వుంటే చిన్న హీరో, కొత్త హీరో అని వుండదు. మెగా ట్యాగ్ వుందనో లేదా పెద్ద హీరో అనో, పాపులర్ హీరో అనో కోట్లకు కోట్లు జల్లేసే కన్నా, ఇలా చేసుకోవడం బెటరేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?