Advertisement

Advertisement


Home > Movies - Movie News

మెగా ముసుగు తొలగింది

కొన్నాళ్ల క్రితం మెగాస్టార్‌ను ఆంధ్ర ఎన్నికల్లో మీరు ఎటువైపు అని అడిగితే తనది న్యూట్రల్ స్టాండ్ అని, ఎటువైపు కాదని క్లారిటీగా చెప్పారు. తమ్ముడు పార్టీ పెట్టి, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడ ముందుకు వెళ్తున్నారు. అందువల్ల ఇక తన అండదండలు అవసరం లేదు అన్నట్లు వివరణ ఇచ్చారు. అందరూ శహభాష్ అన్నారు.

గడచిన అయిదేళ్లలో ఆంధ్ర సిఎమ్ జగన్ ఎంతో అభిమానం కనబర్చారు మెగాస్టార్ అంటే. ఇంటికి లంచ్ కు పిలిచారు. సన్మానించారు. గౌరవించారు. తరువాత మెగాస్టార్ కు టికేెట్ ల పెంపు అవసరం పడినపుడల్లా మంత్రి కన్నబాబు సహకరించారు. జగన్ కు మెగాస్టార్ కు మధ్య వారథిలా నిలిచారు.

అలాంటిది ఇప్పుడు మెగాస్టార్ వున్నట్లుండి తన ముసుగు తీసారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ లో వున్న సంగతి మరిచారు. తెలంగాణ ఎన్నికల్లో పెదవి విప్పని సంగతి విస్మరించారు. భాజపా- జనసేన కలవడం లోక కళ్యాణం కోసం అన్నట్లుగా ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేయకుండా, జనసేన- భాజపా కలయికను ప్రశంసించడం అంటే నైతికత ఎలా అవుతుంది అన్నది ఆయనే చెప్పాలి.

తెలుగుదేశం నుంచి ఫిరాయించి, భాజపాలోకి వెళ్లిన సిఎమ్ రమేష్ ను తలకెత్తుకుంటున్నారు. అలాగే ప్రజారాజ్యంతో మొదలుపెట్టి పలు పార్టీలు మారిన పంచకర్ల రమేష్ బాబును ప్రమోట్ చేస్తున్నారు. కానీ తననే నమ్ముకున్న, ఇప్పటికీ తనంటే గౌరవం వున్న కురసాల కన్నబాబు ను మాత్రం పట్టించుకోరు. ఎందుకంటే ఆయన వైకాపాలో వున్నారు కనుక. ఇదే కనుక, మెగాస్టార్ కన్నబాబు ను కూడా గెలిపించమని అడిగి వుంటే, అన్ని పార్టీల వారిని సమాదరిస్తున్నారు, అందరివాడు అనిపించుకునేవారు.

అలా కాకుండా తమ్ముడి పార్టీకి అయిదు కోట్లు డొనేషన్ ఇచ్చి, తమ్ముడు పార్టీ కూటమి అభ్యర్ధులను ప్రమోట్ చేయడం అంటే మెగాస్టార్ తన ముసుగు పూర్తిగా తీసేసినట్లే. ఇక ఒక్కటే మిగిలింది. జనసేన తరపున ప్రచారంలోకి దిగడం. అవసరం అయితే అదీ చేసేస్తారేమో.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?