Advertisement

Advertisement


Home > Politics - Analysis

‘సర్వే’శ్వరుల చిత్రాలు ఇవీ

‘సర్వే’శ్వరుల చిత్రాలు ఇవీ

పేరు, ఊరు లేని ప్రతి వోడూ ఓ ఎన్నికల ‘సర్వే’యరే. ఫొటోషాప్ లో ఓ లెటర్ హెడ్ డిజైన్ చేసుకోవడం, మంచి అందమైన గ్రాఫ్ లు ముద్రించడం, ఇంత శాతం టీడీపీ, ఇంత శాతం వైకాపా అంటూ సర్వే ఫలితాలు చెప్పేయడం. వీటిలో అధికశాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వుంటాయి. న్యూట్రల్ ఓటర్లను, అటు ఇటు ఊగే ఓటర్లను ప్రభావితం చేసుకోవడానికి ఈ టెక్నిక్. ఆంధ్రలో ఏదో జరిగిపోతోంతదనే భ్రమ కల్పించడానికి ఈ సర్వేలు.

ఇవి భలే చిత్రంగా వుంటాయి. ఎంత మందిని కాంట్రాక్ట్ చేసారో తెలియదు. ఎలా కాంట్రాక్ట్ చేసారు అన్నది క్లారిటీ వుండదు. కానీ తెలుగుదేశం పార్టీకి ఇన్ని, వైకాపా కు ఇన్ని అంటూ చెప్పేస్తారు. అక్కడితో ఆగరు. ఓట్ల శాతం కూడా లెక్క కట్టి చెప్పేసారు. ఇది ఎలా సాధ్యం అన్నది మాత్రం అడగకూడదు.

పైగా చాలా సర్వేలది ఇంకో చిత్రం వుంది. 30 నుంచి 40 మధ్య అంటూ అంత గ్యాప్ తీసుకోవడం ఒక చిత్రం. ఇంకో చిత్రం కూడా వుంది. తేదేపా ఇన్ని గెలుస్తుంది అని భారీ నెంబర్ ఇస్తారు. వైకాపా ఇన్ని మాత్రమే గెలుస్తుంది అని చిన్న నెంబర్ ఇస్తారు. ఇక్కడ చేసే గమ్మత్తేమిటంటే టఫ్ ఫైట్ అంటూ భారీ నెంబర్ ఇస్తారు. తేదేపా ఎడ్జ్ వుంటే చాలు గెలిచే లెక్కలో వేస్తారు. వైకాపా ఎడ్జ్ వుంటే హోరా హోరీ లో వేస్తారు. ఆ విధంగా తాము సేఫ్ సైడ్ లో వుండేలా చూసుకుంటారు. తమకు కావాల్సిన విధంగా సర్వేలను ప్రెజెంట్ చేస్తారు.

వీటిని పట్టుకుని ఇక సోషల్ మీడియా హ్యాండిల్స్ ఊగిపోతుంటాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?