ఆచార్య డిస్ట్రిబ్యూటర్ల కష్టాలు కథలు కథలుగా మారుతున్నాయి. ఆంధ్రలో అయితే అంతా రన్నింగ్ బిజినెస్ చేసే వారు కనుక, ఏం జరుగుతుందో చూద్దామని వేచి వున్నారు.
నైజాం బయ్యర్ కూడా అదే తీరుగా వున్నారు. అయితే నైజాం బయ్యర్ నుంచి ‘కళ్యాణ్ కర్ణాటక’ అంటే కర్ణాటక-నైజాం బోర్డర్ తెలుగు ఏరియాలకు కొన్న డిస్ట్రిబ్యూటర్ మాత్రం తన గోడు వివరిస్తూ మెగాస్టార్ చిరంజీకి లేఖ రాసారు.
చిరంజీవి చరిష్మాను నమ్మి నైజాం బయ్యర్ వరంగల్ శ్రీను దగ్గర నుంచి భారీ మొత్తానికి ఆచార్య హక్కులు తన ప్రాంతానికి కొనుగోలు చేసానని, ఏడాది క్రితమే డబ్బులు చెల్లించానని, ఇప్పుడు కనీసం 25 శాతం కూడా రికవరీ కాలేదని డిస్ట్రిబ్యూటర్ రాజగోపాల్ బజాజ్ తన లేఖలో పేర్కొన్నారు.
మెగాస్టార్ కలుగ చేసుకుని తనకు న్యాయం చేయాలని అలా అయితేనే భవిష్యత్ లో తాను మరోసారి మరో సినిమా పంపిణీ చేయగలనని, వ్యాపారం కొనసాగించగలనని ఆయన వివరించారు. మరి ఇంతకీ ఈ లేఖకు విదేశాల్లో వున్న మెగాస్టార్ స్పందిస్తారో? స్పందంచరో?