Advertisement

Advertisement


Home > Movies - Movie News

కొత్త ప్రాపర్టీ కొన్న మెగాస్టార్?

కొత్త ప్రాపర్టీ కొన్న మెగాస్టార్?

సెలబ్రిటీల జీవితాల్లో ఏం జరిగినా వార్తే.  అందులోనూ చిరంజీవి లాంటి మెగాస్టార్ ఏం చేసినా ఆసక్తికరమైన వార్తే. ఇంతకీ విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి ఇటీవల 1200 గజాల స్థలమో, ఇంటితో కూడిన స్థలమో కొనుగోలు చేసారని గ్యాసిప్ లు  వినిపిస్తున్నాయి. 

ఎంపీ,ఎమ్మెల్యేలకు, సెలబ్రిటీలకు చాలా మందికి ఇళ్లు వున్న జూబ్లీ హిల్స్ ఏరియాలో ఆయన ఈ ప్రాపర్టీని తన కుమార్తె పేరిట కొనుగోలు చేసారని తెలుస్తోంది.

అయితే నిజానికి ఆ ప్రాంతంలో మెగాస్టార్ కు, రామ్ చరణ్ కు ఇప్పటికే పలు ప్రాపర్టీలు వున్నాయని వార్తలు వున్నాయి. పైగా మెగాస్టార్ కు కూడా వున్నాయని అంటారు. ప్రస్తుతం కొన్న ప్రాపర్టీ మార్కెట్ విలువ పాతిక కోట్ల వరకు వుంటుందని చెబుతున్నారు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్నారు. దీని తరువాత లూసిఫర్ రీమేక్, వేదాలం రీమేక్, మైత్రీ మూవీస్ సినిమాలు చేయాల్సి వుంది.

నిమ్మగడ్డకు నిఖార్సైన ప్రశ్న

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?