బ్యూటిఫుల్ లొకేష‌న్లో బ్యూటీ..!

ప్ర‌కృతి కాంత‌గా మారిపోయింది మెహ్రీన్. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఒక మోస్త‌రుగా రాణిస్తున్న ఈ భామ‌.. వైవిధ్య‌భ‌రిత‌మైన ప్ర‌కృతి అందాల మ‌ధ్య‌న క‌నిపిస్తూ ఉంది. త‌ర‌చూ ఆ మేర‌కు ఫొటోల‌ను పోస్టు చేస్తూ…

ప్ర‌కృతి కాంత‌గా మారిపోయింది మెహ్రీన్. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఒక మోస్త‌రుగా రాణిస్తున్న ఈ భామ‌.. వైవిధ్య‌భ‌రిత‌మైన ప్ర‌కృతి అందాల మ‌ధ్య‌న క‌నిపిస్తూ ఉంది. త‌ర‌చూ ఆ మేర‌కు ఫొటోల‌ను పోస్టు చేస్తూ ఉంది. వివిధ సంద‌ర్భాల్లో త‌ను దిగిన వివిధ ప్ర‌కృతి ర‌మ‌ణీయ దృశ్యాల‌కు సంబంధించిన పిక్స్ ను మెహ్రీన్ పోస్టు చేస్తూ ఉంది.

ఎక్క‌డో విదేశాల్లోని అంద‌మైన లొకేష‌న్ల‌లో దిగిన పొటోల‌తో స‌హా.. చిక్ మ‌గ‌ళూరు ప్రాంతంలో కొండ‌లోయ‌ల్లో దిగిన ఫొటోల‌ను కూడా మెహ్రీన్ పోస్టు చేస్తూ ఉంది. ప్ర‌కృతిలో మ‌మేకం అయిపోతూ ఉంది. అందుకు సంబంధించిన కోట్స్ ను కూడా ఈ పిక్స్ తో పాటు పోస్టు చేస్తూ ఉంది. ప్ర‌కృతిలో మ‌మేకం అయిపోవాలంటే ప్ర‌కృతిని న‌మ్మాల‌ని అంటోంది ఈ హీరోయిన్.

చాలా మంది హీరోయిన్లు పార్టీలు, ప‌బ్బుల‌కు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాకు ఎక్కించి హ‌డావుడి చేస్తూ ఉంటారు. మెహ్రీన్ మాత్రం.. ప్ర‌కృతి ర‌మ‌ణీయ దృశ్యాల్లో త‌ను క‌నిపిస్తూ ఫాలోయ‌ర్ల‌ను ప‌ల‌క‌రిస్తూ ఉంది.