మైకేల్..ట్రయిలర్..విషయం వుంది

హీరో సందీప్ కిషన్ ఎంచుకునే కథలు అన్నీ వైవిధ్యంగానే వుంటాయి. కానీ ఎందుకో అతన్ని అంతగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఈసారి మాత్రం చాలా గట్టి ప్రయత్నంతో వస్తున్నట్లు కనిపిస్తోంది. రంజిత్ జయకోడి దర్శకత్వంలో వస్తున్న…

హీరో సందీప్ కిషన్ ఎంచుకునే కథలు అన్నీ వైవిధ్యంగానే వుంటాయి. కానీ ఎందుకో అతన్ని అంతగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఈసారి మాత్రం చాలా గట్టి ప్రయత్నంతో వస్తున్నట్లు కనిపిస్తోంది. రంజిత్ జయకోడి దర్శకత్వంలో వస్తున్న మైకేల్ సినిమా ట్రయిలర్ చూస్తే సందీప్ ఈసారి గట్టిగా కొట్టేలాగే వుంది వ్యవహారం. ట్రయిలర్ లో చూస్తుంటే భారీ తారాగణం అనే కన్నా, మంచి స్టామినా వున్న నటులు అంతా కనిపిస్తున్నారు.

విజయ్ సేతుపతి..గౌతమ్ మీనన్…వరలక్ష్మీ శరత్ కుమార్..అనసూయ ఇలా చాలా మంది. అందరూ పాత్రల్లో ఒదిగిపోయేవారే. ట్రయిలర్ కట్ భలే చిత్రంగా వుంది. ఎక్కడా కథ రివీల్ చేసే ఎత్తుగడ కానీ, నడక కానీ, ముగింపు లేదా ట్విస్ట్ కానీ ఏదీ లేదు. హీరో గురించి రివీల్ చేస్తూనే, పాత్రలు పరిచయం చేస్తూ, ప్రతి పాత్రతో ది బెస్ట్ అనే సీన్ ను కట్ చేసి పెట్టారు. శామ్ సిఎస్ సంగీతం బాగుంది. డైలాగులు కూడా బాగున్నాయి.

డార్క్ థీమ్ థ్రిల్లర్ అనేట్లుగా కనిపిస్తున్న మైకేల్ సినిమా ఫిబ్రవరి 3న విడుదలవుతుంది. భరత్ చౌదరి, ఆసియన్ సునీల్ నిర్మాతలు.