సినిమావాళ్లు రాజకీయాలకు పనికిరారు

సినిమా వాళ్లు రాజకీయాలు చేయలేరని తేల్చి చెప్పారు మోహన్ బాబు. గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత.. సినిమాల్లో నుంచి వెళ్లి ముఖ్యమంత్రులుగా ఎదిగినా.. ఇప్పుడలాంటి పరిస్థితులు లేవని, ఇకపై ఎవరూ సినిమాల్లో నుంచి వెళ్లి…

సినిమా వాళ్లు రాజకీయాలు చేయలేరని తేల్చి చెప్పారు మోహన్ బాబు. గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత.. సినిమాల్లో నుంచి వెళ్లి ముఖ్యమంత్రులుగా ఎదిగినా.. ఇప్పుడలాంటి పరిస్థితులు లేవని, ఇకపై ఎవరూ సినిమాల్లో నుంచి వెళ్లి సీఎంలు కాలేరని అంటున్నారు.

“ఇంక వర్కవుట్ అవ్వదు. సినిమాలు హిట్టయినంత మాత్రాన ముఖ్యమంత్రి అవుతారనుకోవడం కష్టం. జాతకంలో ఉంటే తప్ప సీఎం అవ్వడం అసాధ్యం. ఆ రోజులు వేరు, ఈరోజులు వేరు.”

మోహన్ బాబు చెప్పిన ఈ మాటలు పరోక్షంగా పవన్ కల్యాణ్ నే గుర్తుకు తెస్తున్నాయి. ఎందుకంటే, ప్రస్తుతం రాజకీయాల్లో సినిమాల నుంచి వచ్చి సీరియస్ గా పాలిటిక్స్ చేస్తున్న వ్యక్తి… ముఖ్యమంత్రి అవుతాడంటూ ఫ్యాన్స్ పదే పదే చెబుతున్న వ్యక్తి కేవలం పవన్ మాత్రమే.

అయితే మెహన్ బాబు మాత్రం ఎక్కడా పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా వాళ్లకు రాజకీయాలు సెట్ అవ్వవని తేల్చేశారాయన. అంతెందుకు, ఒకప్పుడు తనకు కూడా రాజకీయాల్లో రాణించాలని ఉన్నప్పటికీ.. ప్రస్తుతం తను కూడా పాలిటిక్స్ కు సెట్ అవ్వనని ఒప్పుకున్నారు మోహన్ బాబు.

ఇక ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి తనకున్న భక్తిని చాటుకున్నారు మోహన్ బాబు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటినుంచీ తనకు తెలుసని, ఆయన ప్రధాని అవుతారని తానుకూడా చెప్పానని, ప్రదాని అయిన తర్వాత కూడా తమ మధ్య సత్సంబంధాలున్నాయని చెప్పుకొచ్చారు. ప్రధానిని తాను కాకా పడుతున్నానని చాలామంది అపార్థం చేసుకుంటున్నారని, అది కాకా కాదని, వ్యక్తిగత పరిచయం అని ముక్తాయించారు. ఇకపై ఏడాదికి ఒక సినిమా చేస్తానని చెప్పారు మోహన్ బాబు. 

ఒక వైపు నుయ్యి మరోవైపు గొయ్యి.. ఈ 'దేశం'కి ఏమైంది