నటుడు మోహన్ లాల్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను వెంటనే కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్టు తేల్చారు.
కొన్ని రోజులుగా వర్క్ పరంగా బిజీగా ఉన్నారు మోహన్ లాల్. దీనికి కారణం బారోజ్ సినిమా. ఈ సినిమాలో ఆయన నటించడమే కాదు, స్వయంగా దర్శకత్వం కూడా వహిస్తున్నారు. అందుకే ఆయన ఎక్కువ ఒత్తిడికి లోనయ్యారు.
ఈ కారణంగానే ఆయన అస్వస్థతకు గురయ్యారు. కొద్దిసేపటికిందట ఆయన డిశ్చార్జ్ అయి ఇంటికెళ్లారు. 5 రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న బారోజ్ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.
మోహన్ లాల్ అస్వస్థత కారణంగా సినిమా మరోసారి వాయిదా పడుతుందనే పుకార్లను ఆయన టీమ్ ఖండించింది. అక్టోబర్ 3న ఈ సినిమా రిలీజ్ అవుతుందని నిన్ననే ప్రకటించారు.
ఇండియా గర్వించదగ్గ నటుల్లో ఒకరు మోహన్ లాల్. తెలుగులో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే 4సార్లు జాతీయ అవార్డు అందుకున్న ఈ నటుడు, తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో మరోసారి నేషనల్ అవార్డ్ పై కన్నేశారు
Call boy jobs available 8341510897
Vc estanu 9380537747
We wish this great actor full recovery and good health.
ఈయన ఆవార్డులు ఎప్పుడు కొనుక్కోలేదు.
అలా అవార్డులు కొనే వెర్రి పుష్పం కాదు ఈయన.
Get well soon sir
జనం పట్టించుకోరు