Advertisement

Advertisement


Home > Movies - Movie News

మోక్షజ్ఞ...కాస్త తగ్గాడు

మోక్షజ్ఞ...కాస్త తగ్గాడు

చిరకాలంగా నందమూరి మోక్షజ్ఞ ఫొటోలు ఒకటి రెండు మినహా బయటకు రాలేదు. ఫ్యాన్స్ బర్త్ డే విసెష్ చెప్పాలన్నా కూడా ఏనాటిదో పాత ఫొటో వాడాల్సిందే. కుర్రాడు బాగా అంటే బాగా వళ్లు చేసాడనీ, తగ్గే పనిలో వున్నాడని అనేక గుసగుసలు వినిపించేవి. వాటితో పాటే అసలు సినిమాలు అంటే మనవాడికి అంత ఆసక్తి లేదనీ వినిపించేది.

ఈ మధ్యనే సినిమాల్లోకి రావడానికి కాస్త ఆసక్తి పెంచుకుంటున్నాడని టాక్. నిజానికి సినిమాల్లోకి రావాలనే బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి ముంబాయిలో ఫుల్ ట్రయినింగ్ కూడా అయ్యాడు. 

సరే, అదంతా గతం. లేటెస్ట్ గా మోక్షజ్ఞ ఫొటో బయటకు వచ్చింది. సంక్రాంతికి కారంచేడు వెళ్లింది బాలయ్య ఫ్యామిలీ. బహుశా పెద బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి వుంటారు.

అక్కడ ఊరిలో తెల్లటి గుర్రం ఎక్కి హల్ చల్ చేసాడు బాలయ్య. ఆయనతో పాటే మోక్షజ్ఙ కూడా గుర్రం ఎక్కాడు. ఫొటోలకు చిక్కాడు. ఫొటొల్లో కాస్త తగ్గినట్లు కనిపించాడు. మరి కాస్త తగ్గితే సినిమాలకు రెడీ అయిపోవచ్చేమో? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?