చంద్రబాబు అధికారంలో వుండగా డైరక్టర్ ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసారు. అది చంద్రబాబు ఇమేజ్ ను ఎంతో కొంత దెబ్బతీసింది. ఇప్పుడు జగన్ అధికారంలో వున్నారు. మరి ఇప్పుడెందుకు ఆర్జీవీ సినిమాలు తీయకూడదు? ఇదీ సీనియర్ జర్నలిస్ట్ ఆర్కే కోరిక కమ్ సందేహం.
అందుకే ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను తీసుకెళ్లి కాళ్లు వాచిపోయేలా కొట్టిన ఉదంతం పై ఎందుకు సినిమా తీయకూడదు అని సూచించారు ఆర్జీవీకి. కానీ అది చాలా చిన్న లైన్ అని, రెండు గంటల సినిమాకు సరిపోదని అంటున్నారు ఆర్జీవీ. ఓ నైట్ ఓడ్కా వేసి ఆలోచిస్తే కథ వచ్చేస్తుందంటున్నారు ఆర్కే. అబ్బే అంతలేదంటున్నారు ఆర్జీవీ.
సరే అయితే వివేకానంద రెడ్డి హత్య మీద సినిమా తీయొచ్చు కదా అంటున్నారు ఆర్కే. అక్కడితో ఆగలేదు. జగన్ అంటే భయం అందుకే సినిమా తీయరు అంటూ ఆర్జీవీని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇంత బాధ ఎందుకు ఆర్కే కి? తానే బ్యానర్ పెట్టి సినిమాలు తీసేయచ్చుకదా? తన చానెల్ లో వేసుకుని జనాలకు ఫ్రీగా చూపించేయవచ్చు. ఏమిటో ఈ బాధ. మేధావులు జగన్ పై మాట్లాడడం లేదని, సినిమా జనాలు జగన్ పై సినిమాలు తీయడం లేదని, ఒక బాధ కాదు పాపం.