Advertisement

Advertisement


Home > Movies - Movie News

నాడు తొడగొట్టి...నేడు జతకట్టి

నాడు తొడగొట్టి...నేడు జతకట్టి

రాజకీయాల్లోనే కాదు, ఎక్కడా శాశ్వత శతృవులు..వుండరు. శాశ్వత బంధువులు వుండరు. నందమూరి ఫ్యామిలీ ఎపిసోడ్ చూస్తే ఇలాగే వుంటుంది సదా. పెద్ద అల్లుడు దగ్గుబాటి-చిన్న అల్లుడు నారా మొదట ఎడమొహం పెడ మొహం. తరువాత మామ ను గద్దె దింపడానికి కలిసారు. మళ్లీ ఆ పై విడిపోయారు. వదిన పురంధ్రేశ్వరి కాంగ్రెస్ పంచన చేరారు. మంత్రి అయ్యారు. విశాఖలో చాలా మంది 'తమ వారికి' ఎంతో ఉపయోగపడ్డారు.

ఒకానొకప్పుడు పురంధ్రేశ్వరి సోదరుడు బాలయ్య ఎన్నికల ప్రచారానికి కారంచేడు వెళ్లి, అక్క-బావ ఇంటి ముందు తొడ కొట్టి వార్తల్లోకి ఎక్కారు. ప్రస్తుతం అక్క భాజపాలో, తమ్ముడు తేదేపాలో వున్నారు. గత ఎన్నికల టైమ్ లో భాజపాలో ఆమెకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. పోటీ చేసిన చోట గెలుపు దక్కలేదు.

ఇక బాలయ్య బావగారు దగ్గుబాటికి కూడా వైకాపాలో పరిస్థితి మరీ అధ్భుతంగా ఏమీ లేదు. ఇలాంటి నేపథ్యంలో ఈ సంక్రాంతికి బాలయ్య వెరైటీగా కారంచేడు వెళ్లారు. ఎప్పుడూ కుప్పం వెళ్తారు. చంద్రబాబు అండ్ కో అంతా. కానీ ఈసారి అక్కడికి ఎవ్వరూ వెళ్లలేరు. 

బహుశా మరి అందుకనో, లేక మరెందుకనో బాలయ్య కారంచేడు వెళ్లారు. అక్కడ పండగ రోజు సరదాగా గడిపారు. జగన్ ను ఎదుర్కోవడానికి సామాజిక శక్తులు అన్నీ ఏకం కావాలనే ప్రయత్నాలు బలంగా ప్రారంభమయ్యాయి. మరి అందులో భాగమే ఈ పండగ సందడి అనుకోవాలో?మరింకేం అనుకోవాలో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?