Advertisement

Advertisement


Home > Movies - Movie News

స్వాతిముత్యం...వర్జిన్

స్వాతిముత్యం...వర్జిన్

కుర్రాడు స్వాతిముత్యంలా కనిపిస్తున్నాడు అనుకుంటే అమ్మాయి చటుక్కున 'నువ్వు వర్జిన్ నా?' అని అడిగేసింది. పోనీ స్వాతిముత్యం కుర్రాడు ఏమైనా అవును అన్నాడా అంటే అదీ లేదు..నేను..నేను అంటూ నీళ్లు నమిలాడు. ఇదంతా త్వరలో రాబోతున్న స్వాతిముత్యం టీజర్ వ్యవహారమే. 

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ ను హీరోగా పరిచయం చేస్తూ సితార సంస్థ నిర్మిస్తున్న సినిమానే స్వాతిముత్యం. వర్ష బొల్లమ్మ హీరోయిన్. రావు రమేష్, సీనియర్ నరేష్ లాంటి గట్టి ప్యాడింగ్ వున్న సినిమా ఇది. హీరో మరీ అమాయకంగా స్వాతిముత్యంలాగే కనిపిస్తున్నాడు. మామగారి కాళ్లు కడిగేసేంత అమాయకత్వం. 

కానీ మరి అలాంటి కుర్రాడు నువ్వు వర్జిన్ నా అంటే ఎందుకు నీళ్లు నమిలి సమాధానం చెప్పలేదో తెలియాలంటే, లక్ష్మణ్ కే కృష్ణన్ డైరక్షన్ లో తయారవుతున్న ఈ సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే. 

అన్నట్లు ఇది కుర్రాడు గణేష్ కి పేరుకే మొదటి సినిమా. ఆల్రెడీ పవన్ సాధినేని డైరక్షన్ లో ఓ సినిమా స్వంత నిర్మాణంలో స్టార్ట్ చేసి సగంలో ఆపేసారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?