కొన్ని సినిమాల సంగతులు చిత్రంగా వుంటాయి. కొన్ని ఎప్పుడు ప్రారంభమయ్యాయో అనుకున్నాయో లోగా పూర్తయిపోతాయి. త్రివిక్రమ్-మహేష్ సినిమా సంగతి దీనికి పూర్తిగా భిన్నంగా వుంది. 2020 నుంచి త్రివిక్రమ్ సినిమా ఇప్పటి వరకు తెరపైకి రాలేదు. మూడున్నరేళ్లు అవుతోంది. వచ్చేసరికి మరో ఆర్నెల్లు పడుతుంది.
ఈ సినిమా ఇలా ప్రారంభం కాగానే అలా ఆపేసారు. కేజిఎఫ్ ఫైట్ మాస్టర్లను తీసేసారు. వాళ్ల వర్క్ నచ్చలేదన్నారు. వాళ్లకు ఇచ్చిన భారీ అడ్వాన్స్, ఆ ఫైట్ షూట్ కు చేసిన ఖర్చు అంతా వృధానే.
ఆ తరువాత విలన్ ను మార్చారు
ఆ తరువాత అసలు ఆ స్క్రిప్ట్ కాదు, పక్కా ఫ్యామిలీ స్క్రిప్ట్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఆ విధంగా ఫైట్ మాస్టర్ల తరువాత స్క్రిప్ట్ మారింది.
మారిన స్క్రిప్ట్ కు అనుగుణంగా అమరావతికి అటు ఇటు అనే టైటిల్ బలంగా వినిపించింది. అయితే టైటిల్ అనౌన్స్ మెంట్ తయారు చేసిన గ్లింప్స్ క అనుగుణంగా, సినిమాకు మాస్ కలర్ ఇవ్వడం కోసం ‘గుంటూరు కారం’ అనే టైటిల్ అనౌన్స్ చేసారు. ఆ విధంగా టైటిల్ మారింది.
ఆ తరువాత ఓ షెడ్యూలు చేసారు. కానీ అది వాడడం లేదని వార్తలు వచ్చాయి.
ఆ తరువాత జూన్ ఫస్ట్ వీక్ నుంచి మూడో వారం వరకు షెడ్యూలు ప్లానింగ్ డేట్ లు వినిపిస్తున్నాయి. మారుతున్నాయి. లేటెస్ట్ డేట్ 25 అంటున్నారు. ఫస్ట్ వీక్ అనే టాక్ కూడా వుంది.
అన్నింటికన్నా కీలకం ఈ సినిమా ఆగస్టు 11న విడుదల అని అఫీషియల్ గా ప్రకటించారు. కానీ తరువాత అదీ మారింది. లేటెస్ట్ డేట్ సంక్రాంతి 2024.
ఇక అన్నింటి కన్నా అల్టిమేట్ ఏమిటంటే తివిక్రమ్ కు ఇష్టమైన హీరోయిన్ పూజా హెగ్డేను కూడా మార్చేసారు అన్నది.
సినిమాను ఎంత ఫాస్ట్ గా, నాన్ స్టాప్ గా చేసినా, నెలకు 25 రోజుల వంతున వర్క్ చేసినా, కనీసం అయిదు నెలలు సమయం షూట్ కు పడుతుంది. అంటే నవంబర్ కు షూట్ పూర్తి చేసుకోవచ్చు. సంక్రాంతికి విడుదల చేసుకోవచ్చు.