దసరా విడుదల దిశగా రెడీ అవుతోంది మెగాస్టార్ గాడ్ ఫాదర్. మెగాసూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ మల్టీ స్టారర్ ప్రమోషన్ కు సన్నాహాలు మొదలయ్యాయి. మెగాస్టార్ సినిమా కాబట్టి ఎవర్ని తీసుకురావాలి అన్నది కాస్త క్లిష్టమైన పాయింట్. బాస్ లకే బాస్ కనుక హైదరాబాద్ లో ఈవెంట్ చేసి ఎవర్ని చీఫ్ గెస్ట్ గా తెస్తారు. ఆయనే అన్నింటి చీఫ్ గెస్ట్ గా వెళ్తారు కదా.
అందుకే ఈసారి హైదరాబాద్ లో మరి పంక్షన్ నే ప్లాన్ చేయడం లేదు. అనంతపురంలో కానీ సీడెడ్ లో మరెక్కడైనా కానీ మాంచి ఫంక్షన్ ఒకటి చేస్తారు. అనంతపురంలోనే అన్నది ఇప్పటి వరకు వున్న ఐడియా. సీడెడ్ లో చేస్తే బాగుంటుందని అనుకోవడంతో ఆ విధంగా ఫిక్స్ అయ్యారు.
మరో ఫంక్షన్ ముంబాయిలో చేస్తారు. సినిమాలో సల్మాన్ ఒక కీలకమైన పాత్ర చేస్తున్నారు. ఓ పాట కూడా చేసారు. అందువల్ల ముంబాయిలో ఓ పంక్షన్ చేయాలన్నది రామచరణ్ ఐడియాగా తెలుస్తోంది. ఆ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.
డేట్ లు ఫైనల్ చేయాల్సి వుంది. ఒకటి రెండు రోజుల్లో అవి కూడా ఫైనల్ అవుతాయి. మలయాళ సినిమా లూసిఫర్ కథకు తెలుగుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి గాడ్ ఫాదర్ సినిమాను తీస్తున్నారు. సత్యదేవ్, నయనతార తదితరులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. థమన్ సంగీత దర్శకుడు.