మైత్రీ మూవీస్‌కు త్రివిక్రమ్ ఓ సినిమా చేయాలి. అది జమానా కాలం నాటి మాట. హారిక హాసిని సంస్థకు మాత్రమే సినిమాలు చేయడం పద్దతికి కట్టుబడిన తరువాత మైత్రీ అడ్వాన్స్ ను వెనక్కు ఇచ్చారు త్రివిక్రమ్.
ఆ సందర్భంలో చాలా మల్లగుల్లాలు నడిచాయి. వడ్డీల లెక్కలు కట్టారు. ఆఖరికి ఓ పాయింట్ లో సెటిల్ చేసుకున్నారు. అప్పటి నుంచి మైత్రీ అంటే త్రివిక్రమ్ కు అస్సలు పడదని గ్యాసిప్ లు వున్నాయి.
కానీ ఇటీవల మైత్రీ సంస్థ త్రివిక్రమ్ ను మరోసారి అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. దానికి కారణం వుంది. మైత్రీ సంస్థకు ప్రభాస్ ఓ సినిమా చేయాలి. అది ఈనాటిది కాదు.. ఏనాటిదో అడ్వాన్స్. హను రాఘవపూడి కాంబినేషన్ లో ఆ సినిమా సెట్ అయింది. ఇది కాక త్రివిక్రమ్ ను తెచ్చుకుంటే మరో సినిమా కూడా చేస్తానని ప్రభాస్ అన్నట్లు తెలుస్తోంది.
నిజానికి ఓ సినిమాను త్రివిక్రమ్ డైరక్షన్ లో ప్రభాస్ కు చేయాలని వుంది. ఈ విషయాన్ని గ్రేట్ ఆంధ్ర ఏనాడో వెల్లడించింది.
ప్రభాస్ కోరిక మేరకు మైత్రీ సంస్థ త్రివిక్రమ్ ను అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. కానీ త్రివిక్రమ్ ఫస్ట్ సిట్టింగ్ లోనే నో చెప్పినట్లు తెలుస్తోంది. బహుశా ప్రభాస్ ఊ అంటే త్రివిక్రమ్-హారిక హాసిని కాంబినేషన్ లో సినిమా సెట్ అవుతుందేమో?