సీనియర్ హీరో నాగ్‌కు ప్రయోగాలు కొత్త కాదు. కానీ ఓల్డ్ ఏజ్ లో తుపాకులు పట్టుకుని, అమ్మాయిలతో రొమాన్స్ చేసి జనాలకు కాస్త దూరం అయ్యారు. లేటెస్ట్ గా ట్రెండ్ మారింది. భారీ యాక్షన్ ప్లస్ మాస్ సినిమాల వైపు మళ్లు తున్నారు జనాలు. దానికి డార్క్ థ్రిల్లర్ టచ్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కలబోసి సినిమా చేసే ప్రయత్నంలో పడినట్ల కనిపిస్తోంది నాగార్జున.
నా సామి రంగ అంటూ ఓ సినిమా అనౌన్స్ చేసారు. గ్లింప్స్ తోనే సినిమా కు శ్రీకారం చుట్టారు. ప్రసన్నకుమార్ బెజవాడ కథ, మాటలు అందిస్తున్న సినిమాకు బెన్నీ దర్ళకుడు. సినిమా టైటిల్ తో సహా వివరాలు అన్నీ ముందే బయటకు వచ్చేసాయి.
నాగ్ బర్త్ డే సందర్భంగా బయటకు వచ్చింది గ్లింప్స్ మాత్రమే. మరీ కొత్తగా లేదు కానీ, చూడ్డానికి ఆసక్తిగానే వుంది. లోపలున్నది పులులు కాదురా.. మేకలు అన్న డైలాగు మాస్‌ను ఆకట్టుకునేలా వున్నాయి.
గ్లింప్స్ లో ఆసక్తి కలిగించేది ఏమిటంటే పలాస దర్శకుడు కరుణ్ కుమార్ విలన్ గా కనిపించడం. మెయిన్ విలన్ నో, రెండు, మూడో విలన్ నో కానీ గెటప్, లుక్ బాగానే వుంది. క్లిక్ అయ్యేలాగే వున్నాడు. వరుసపెట్టి చాన్స్ లు రావచ్చు. నాగ్ గెటప్ బాగానే వుంది. చిట్టూరి శ్రీను నిర్మించే ఈ సినిమాకు పవన్ కుమార్ దర్ళకుడు.