నాగ్ అశ్విన్… వన్స్ ఎగైన్ ప్రూవ్డ్

పాన్ ఇండియా కబుర్లు చెప్పడం వేరు. ప్రకటించడం వేరు. తీసి చూపించడం వేరు. ఇప్పటి వరకు ఆ ఫీట్ ను సక్సెస్ ఫుల్ గా చేసి చూపించిన, విజన్ వున్న డైరక్టర్ రాజమౌళి మాత్రమే.…

పాన్ ఇండియా కబుర్లు చెప్పడం వేరు. ప్రకటించడం వేరు. తీసి చూపించడం వేరు. ఇప్పటి వరకు ఆ ఫీట్ ను సక్సెస్ ఫుల్ గా చేసి చూపించిన, విజన్ వున్న డైరక్టర్ రాజమౌళి మాత్రమే. అందులో సందేహం లేదు. మనకు వున్న చాలా మంది తోపు దర్శకులది కేవలం కిట్టింపు వ్యవహారం మాత్రమే. 

పాత సీన్లు, పాత సినిమాలు పట్టుకుని కిందా మీదా కావడమే. కానీ నాగ్ అశ్విన్ అలా కాదు. తన దారి వేరే. నిండుకుండ వ్యవహారం. తనను మోయడానికి ప్రత్యేకంగా బ్యాచ్ లేదు.. అంతా సైలంట్. 

మహానటి సినిమా తీసే నాటికి ఓ సినిమా స్టార్ బయోపిక్ ఎలా తీయాలో తెలుగులో అన్నదానికి ఓ రూల్ బుక్ లేదు. కానీ తీసి చూపించాడు. క్రిష్ లాంటి పెద్ద దర్శకుడు కూడా అదే రూల్ బుక్ ఫాలో కావాల్సి వచ్చింది. 2015లో ఎవడే సుబ్రహ్మణ్యం.. 2018 లో మహానటి.. 2021 లో జాతిరత్నాలు (ఆయన నిర్మాతగా).. ఇప్పుడు 2024లో ప్రాజెక్ట్ కల్కి. ప్రతి సినిమాకు మధ్య మూడేళ్ల గ్యాప్. తొందర లేదు. చేస్తున్న సినిమాకు హడావుడి లేదు. ఏం చేస్తున్నాడో ఊహించుకోవడం తప్ప మరో చాన్స్ లేదు.

ప్రాజెక్ట్ కె అంటూ వస్తున్న నాగ్ అశ్విన్ సినిమా గ్లింప్స్ విడుదల చేసారు. గ్లింప్స్ విడుదల చేయడానికి సరిగ్గా ఒక రోజు ముందు విడుదల చేసిన ప్రభాస్ స్టిల్ పూర్తిగా ఫ్యాన్స్ ను నిరాశలో ముంచింది. నాగ్ అశ్విన్ కూడా ఇలా చేసాడేంటీ అనే మాటలు వినిపించాయి. కానీ ఒకటే ఆశ.. గ్లింప్స్ వస్తుంది కదా చూద్దాం అని.

గ్లింప్స్ వచ్చింది. ఎవరికీ నోట మాట లేదు. ముక్త కంఠంతో సూపర్ అన్నారు. అంటున్నారు. ప్రభాస్ లుక్స్ విషయానికి వస్తే బాహుబలి తరువాత వచ్చిన బెస్ట్ లుక్ ఇదే అంటున్నారు. ఆ విధంగా కూడా నాగ్ అశ్విన్ పాస్ అయిపోయాడు. 2829 సంవత్సరం బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటే విజన్ ఏ రేంజ్ లో వుండాలి. ఆ దృష్టి క్లియర్ గా క్లారిటీగా కనిపించింది గ్లింప్స్ లో.

తెలుగులో ఇప్పుడు నాగ్ అశ్విన్ ఓ హోప్. తెలుగు సినిమాను హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లగలడు..రాజమౌళి మాదిరిగా…మరో దర్శకుడు వున్నాడు.. అంతకు మించి.. అని కూడా అనుకోవచ్చు.