డిష్యూం డిష్యూం ఫైట్ కాదు… పవన్ మీద మంత్రి ధర్మాన సెటైర్లు

జీవితం ఇది. చాలా ఉంటుంది ఇక్కడ. సినిమాలో మాదిరిగా కాదు ఇక్కడ. డిష్యూం డిష్యూం ఫైటింగ్ చేస్తే వెనకాల పది మంది దెబ్బలు తిని పడిపోవడానికి అంటూ సినీ స్టార్ కం పొలిటికల్ లీడర్…

జీవితం ఇది. చాలా ఉంటుంది ఇక్కడ. సినిమాలో మాదిరిగా కాదు ఇక్కడ. డిష్యూం డిష్యూం ఫైటింగ్ చేస్తే వెనకాల పది మంది దెబ్బలు తిని పడిపోవడానికి అంటూ సినీ స్టార్ కం పొలిటికల్ లీడర్ అయిన పవన్ కళ్యాణ్ కి సీనియర్ రాజకీయ నేత మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు బాగా చురకలు అంటించారు.

ఎక్కడ ఏమి జరుగుతోందో ప్రజా జీవితంలోకి ఒకసారి వచ్చి చూస్తే అన్నీ తెలుస్తాయి. అంతే తప్ప ఎక్కడో ఏదో మాట్లాడేస్తే ఇలాగే ఉంటుంది అని కామెంట్స్ చేశారు. వాలంటీర్లు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రెండేళ్ల పాటు కరోనా టైం లో చేసిన సేవ చాలు శభాష్ అనడానికి అని మంత్రి గుర్తు చేశారు.

అలాంటి వలంటీర్ల మీద ఎవరో మహానుభావుడు విమర్శలు చేయడం అంటే ఏమనుకోవాలని పవన్ మీద ఇండైరెక్ట్ గా ఫైర్ అయ్యారు. గ్రామంలోకి వచ్చి వాలంటీర్లు ఏమి చేస్తున్నారు వారితో ప్రజలకు ఎలా సంబంధ బాధవ్యాలు ఉన్నాయన్నది తెలుసుకుంటే ఇలాంటి మాటలు అనే సాహసం చేయరని అన్నారు.

సినిమాల్లో అంతా ఒక్క దెబ్బకు మారిపోతుందని, అదే జీవితంలో ప్రజలకు మేలు చేయలంటే ఎంతో కాలం పడుతుందని ధర్మాన అన్నారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల రూపు రేఖలు మారిపోయాయని ఆర్బీకే కేంద్రాలు, వెల్ నెస్ సెంటర్లు,  సచివాలయాలు, నాడు నేడుతో అభివృద్ధి చెందిన బడులు ఇవన్నీ ప్రజలకు కళ్ళ ముందే ఉన్నాయని ఆయన చెప్పారు.

ప్రజలకు తమ నాయకుడు వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చారని, అయితే ప్రజలు తమకు మేలు చేసేది ఎవరో తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఒక్క హామీ అమలు చేయని నాయకులు బంగారం ఇస్తామంటే ఆశపడితే అదీ ఉండదు, ఇపుడు ఈ ప్రభుత్వం ఇస్తున్నదీ పోతుంది, మొత్తానికి బోడి గుండు అవుతుందని తెలుసుకోవాలని ఆయన ప్రజలను సుతిమెత్తగా హెచ్చరించారు.

ప్రజలను తమ మాయ మాటలతో మభ్యపెట్టి అధికారంలోకి రావచ్చు అని చూస్తున్న వారిని విజ్ఞతతో పక్కన పెట్టాలని ఆయన సూచించారు. అనాడు జన్మభూమి కమిటీలు ప్రజలను ఏ విధంగా దోచుకున్నాయో గుర్తుకు తెచ్చుకుని ఆ పార్టీలను దూరం పెట్టాలని ఆయన కోరారు.