నాగ్ సినిమాకు దొరకని దర్శకుడు!

సీనియర్ హీరోల్లో నాగార్జున పరిస్థితి భలే చిత్రంగా వుంది. తన వయసు మరిచిపోయి చేస్తున్న సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేస్తున్నాయి. రొమాన్స్, యాక్షన్ కోసం ఇంకా యంగ్ హీరోలా కిందా మీదా…

సీనియర్ హీరోల్లో నాగార్జున పరిస్థితి భలే చిత్రంగా వుంది. తన వయసు మరిచిపోయి చేస్తున్న సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేస్తున్నాయి. రొమాన్స్, యాక్షన్ కోసం ఇంకా యంగ్ హీరోలా కిందా మీదా అయిపోతున్నాడు. కానీ జనం వాటిని పక్కన పెట్టేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఓ కథ దొరికింది. కానీ దానికి దర్శకుడు దొరకలేదు.

బెజవాడ ప్రసన్న అనే రైటర్ చెప్పిన కథ నాగ్ కు నచ్చింది. కానీ ఎవరు డైరక్ట్ చేస్తారు అన్నది పాయింట్. పైగా ఇప్పటికే నాగ్ తో సినిమాలు చేసిన వారికి మంచి అనుభవాలే వున్నాయి. అందుకే ఒకరిద్దరిని అడిగినా సున్నితంగా తప్పుకున్నారు. దాంతో ఇప్పుడు కథ తెచ్చిన బెజవాడ ప్రసన్ననే దర్శకుడిని చేసేస్తున్నారు నాగార్జున.

బెజవాడ ప్రసన్నకు కూడా దర్శకుడు కావాలని ఎప్పటి నుంచో వుంది. నక్కిన త్రినాధరావుకు షాడో దర్శకుడు బెజవాడే అని గుసగుసలు వున్నాయి. అలా వేళ్లు పెట్టడం వల్లే తరచు నక్కిన-బెజవాడ కిందా మీదా పడుతుంటారనీ టాక్ వుంది. మొత్తం మీద నాగార్జున ఓ కొత్త దర్శకుడికి మళ్లీ అవకాశం ఇస్తున్నారన్నమాట.