Advertisement

Advertisement


Home > Movies - Movie News

నాగ్ మరో 'గగనం'

నాగ్ మరో 'గగనం'

గతంలో గగనం అనే సినిమా చేసాడు హీరో నాగార్జున. విమానం హైజాక్ నేపథ్యంలో అల్లుకున్న కథ అది. మళ్లీ చాన్నాళ్లకు అలాంటి డిఫరెంట్ సినిమా చేస్తున్నాడు. మన్మధుడు 2 సినిమాతో 'మన్మధుడు..అందగాడు..కొడుకులతో సమానంగా వయస్సు వున్నట్లున్నాడు' ఇలాంటి భ్రమలు అన్నీ తొలగిపోయాయి. జనాలు తెగ మోసారు. నాగ్ అందగాడు..మన్మధుడు అంటూ. అది చూసి తన వయసులో సగం కూడా లేని రకుల్ తో సినిమా చేసాడు. జనం తిప్పి కొట్టారు.

ఇప్పుడు చక్కగా హీరోయిన్, డ్యూయట్లు అవసరం లేని సినిమా చేస్తున్నాడు. టెర్రరిజం నేపథ్యంలో అల్లుకున్న కథను కొత్త దర్శకుడు సోలమన్ తయారుచేసారు. ఈ సినిమాలో ఇంటిలిజెన్స్ లేదా రా అధికారిగా నాగ్ కనిపిస్తారు. ఆ కనిపించడం కూడా తన ఏజ్ కు తగినట్లే కనిపిస్తారని బోగట్టా. 

హీరోయిన్ వున్నా, పెద్దగా పాత్ర ఏమీ వుండదని తెలుస్తోంది. పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్ గా సినిమా వుంటుందని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా హైదరాబాద్ సిటీలోనే పలుప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. వీలయినంత త్వరగా ఫినిష్ చేసి, ప్రీ సమ్మర్ లో విడుదల చేయాలన్నది ప్లాన్ గా తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?