దర్శకుడు ప్రవీణ్ సత్తారు అందించిన అతి దారుణ డిజాస్టర్ ఘోస్ట్ తరువాత హీరో నాగార్జున సైలంట్ అయిపోయారు. దర్ళకుడు ప్రవీణ్ సత్తారు అంతటి అద్భుతాన్ని సాధించారు ఆ సినిమాతో. ఇప్పుడే తేరుకుని నాగ్ ఒకేసారి రెండు సినిమాలను ప్రకటించబోతున్నారు.
చిట్టూరి శ్రీను నిర్మాతగా ఓ సినిమాను ప్రకటిస్తారు. డ్యాన్స్ డైరక్టర్ బిన్నీమాస్టర్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. వెలిగొండ శ్రీనివాస్ మూల కథ, బెజవాడ ప్రసన్న కథ, బిన్నీ మాస్టర్ కథా విస్తరణతో ఈ సినిమా వుంటుందని తెలుస్తోంది.
అలాగే థనుష్ తో దర్శకుడు శేఖర్ కమ్ముల చేయబోయే సినిమాలో నాగ్ కీలకపాత్ర పోషించబోతున్నారు. ఈ సినిమా ప్రకటన కూడా రేపే వస్తుంది.
నాగ్ బర్త్ డే రేపు. ఈ సందర్భంగానే ఈ రెండు సినిమాలను ప్రకటిస్తారు. ఈ రెండు సినిమాలతో పాటు బిగ్ బాస్ షో ను కూడా సమాంతరంగా చేయాల్సి వుంటుంది. బిగ్ బాస్ లేటెస్ట్ అప్ డేట్ కూడా వుంటే వుండొచ్చు.
నాగ్-చిట్టూరి శ్రీను సినిమా సంక్రాంతి టార్గెట్ గా రెడీ అవుతుంది. దాని కోసం పెర్ ఫెక్ట్ ప్లానింగ్ ను సెట్ చేసారు. నాగ్ కు సంక్రాంతి సెంటిమెంట్ బలంగా వుంది. అందుకే ఈ సినిమాను చకచకా ఫినిష్ చేస్తారు.