Advertisement

Advertisement


Home > Movies - Movie News

తన గురించి తానే చెప్పుకుంటున్న చైతన్య

తన గురించి తానే చెప్పుకుంటున్న చైతన్య

స్టార్స్ కు సంబంధించి అభిమానుల్లో చాలా డౌట్స్ ఉంటాయి. వాటికి సమాధానాలు తెలుసుకోవాలని వాళ్లు భావించడం సహజం. అందుకే తన అభిమానుల కోసం నాగచైతన్య ఓ సరికొత్త ఆలోచన చేశాడు. తనను రెగ్యులర్ గా అడిగే ప్రశ్నలకు తనే స్వయంగా సమాధానాలు చెప్పాడు. వాటిని గూగుల్ క్యామియోస్ లో పెట్టాడు. ఇలా గూగుల్ కామియోస్ లో ఎంటర్ అయిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ స్టార్ గా నిలిచాడు నాగచైతన్య.

ఇకపై చైతూ గురించిన సాధారణ సమాచారం కోసం ఎక్కడో వెదకాల్సిన అవసరం లేదు. డైరక్ట్ గా గూగుల్ క్రోమ్ లోకి వెళ్లి నాగచైతన్య అని టైపు చేసి సెర్చ్ చేస్తే చాలు. "మోస్ట్ ఆస్క్ డ్ క్వశ్చన్స్" ట్యాగ్ కింద స్వయంగా నాగచైతన్య ఆన్సర్ చెప్పే వీడియోస్ పెట్టారు. తను ఎక్కడ పుట్టాడు, తన మోచేతిపై ఉన్న పచ్చబొట్టుకు అర్థం ఏంటనే రెండు ప్రశ్నలను మాత్రమే ప్రస్తుతానికి ఉంచారు. త్వరలోనే ఈ విభాగం కింద మరిన్ని ప్రశ్నల్ని చేర్చబోతున్నారు.

గూగుల్ లో సెర్చ్ కొడితే మనకు కావాల్సిన అంశానికి సంబంధించి చాలా వెబ్ సైట్స్, యూట్యూబ్ లింక్స్ వస్తుంటాయి. కాకపోతే వాటిలో ఉన్న సమాచారం ఎంతవరకు నిజం అనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేం. అదే గూగుల్ క్యామియోస్ లో సెర్చ్ చేస్తే ఇక ఆ సమాచారంలో నిజం ఎంత అని ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే, స్వయంగా స్టార్లే తనకు సంబంధించిన వివరాల్ని ఇందులో వెల్లడిస్తారు కాబట్టి. త్వరలోనే మరింతమంది సౌతిండియా స్టార్స్ ను ఇలా క్యామియోస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది గూగుల్.

సినిమా రివ్యూ: రాజుగారి గది 3

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?