నాగవంశీ ఓవర్ కాన్ఫిడెన్స్!

కాన్ఫిడెన్స్ వుండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదు. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, కింగ్ నాగార్జున ఘోస్ట్ అనే రెండు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి దసరా కు. వాటి మధ్యకు లేగదూడలాంటి స్వాతిముత్యం…

కాన్ఫిడెన్స్ వుండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదు. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, కింగ్ నాగార్జున ఘోస్ట్ అనే రెండు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి దసరా కు. వాటి మధ్యకు లేగదూడలాంటి స్వాతిముత్యం సినిమాను వదలడం అంటే ఏమనుకోవాలి? నిర్మాత బెల్లంకొండ రెండో కొడుకు గణేష్ తొలి సినిమా స్వాతిముత్యం. వర్ష బొల్లమ్మ హీరో. కొత్త దర్శకుడు. పది కోట్ల రేంజ్ చిన్న సినిమా.

ఇలాంటి సినిమాను ఎవరైనా సరే సేఫ్ జోన్ లో వదలాలి అనుకుంటారు. కానీ నాగవంశీ మాత్రం పట్టుదలకు పోయి అక్టోబర్ 5నే విడుదల చేయాలనుకుంటున్నారు. 

నైజాంలో ఘోస్ట్ కు ఎక్కువ థియేటర్లు పడతాయి. ఎందుకంటే దాని నిర్మాత సునీల్ కు థియేటర్ల వ్యాపారం వుంది. మెగాస్టార్ గాడ్ ఫాదర్ కు సీడెడ్ లో థియేటర్ల వ్యాపారం వున్న ఎన్వీ ప్రసాద్ నిర్మాత.

ఇలాంటి నేపథ్యంలో నాగవంశీ కి ఫైనాన్సియల్ గా రిస్క్ లేకపోవచ్చు కానీ ఓపెనింగ్ రిస్క్ వుంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఛాయిస్ ఎలాగూ ఆ రెండు సినిమాలే వుంటాయి. కానీ వన్స్ విడుదలయిన తరువాత దేని కంటెంట్ బాగుంటే దానికి జనం వస్తారు. కానీ ఆ టాక్ ను స్వాతి ముత్యం తెచ్చుకోగలదా? అన్నది పాయింట్. మరి ఏ ధైర్యంతో దసరా బరిలోకి దింపుతున్నారో స్వాతిముత్యాన్ని.