కరోనా లాగే బిగ్‌బాస్ కూడా కంటికి కనిపించడు. కానీ ఆయన మాటే శిలాశాసనం. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్…అంతే. ఇంకో మాటకు, వాదనకు తావు లేదు. ఒకవేళ ఎవరైనా బిగ్‌బాస్ మాటను ధిక్కరిస్తే…ఆ హౌజ్ నుంచి బయటికి రావాల్సిందే. ఇక ఆ బిగ్‌బాస్ రియాల్టీ షోలో హోస్ట్‌గా వ్యవహరించే వ్యక్తి చిన్నబాస్ అన్నమాట.
ఎంతో ముఖ్యమైన పనులు తప్ప మిగిలిన సందర్భాల్లో కరోనా ఎఫెక్ట్‌తో నాలుగైదు నెలలుగా ఇంటి నుంచి కదలని చిన్నబాస్ను బిగ్‌బాస్ ఎట్టకేలకు బయటికి రప్పించాడు. ఆ చిన్న బాస్ మరెవరో కాదు…మన మన్మథుడు హీరో నాగార్జున. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో షూటింగ్‌లకు అనుమతి ఇచ్చినప్పటికీ పెద్ద హీరోలెవరూ కెమెరా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అన్నీ చక్కబడిన తర్వాత చూద్దాంలే అని వేచి చూసే ధోరణిలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో హీరో నాగార్జున షూటింగ్ స్పాట్‌కు వెళ్లడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. దీనికి కారణం బిగ్‌బాస్ రియాల్టీ షో కోసమనే టాక్ వినిపిస్తోంది. వచ్చే నెల రెండో వారం నుంచి బిగ్‌బాస్ తెలుగు సీజన్-4 రియాల్టీ షో స్టార్ట్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కార్యక్రమ ప్రోమో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా రియాల్టీ షో హోస్ట్ నాగార్జునకు సంబంధించి ప్రోమో విడుదలకు సంబంధించి షూటింగ్ చేపట్టారని సమాచారం.
దీంతో ఐదారు నెలల తర్వాత నాగార్జున కెమెరా ముందు నిలబడ్డారని టాలీవుడ్ టాక్. నాగార్జున సొంత స్టూడియో అన్నపూర్ణలో చేపట్టిన షూటింగ్లో ఆయన పాల్గొన్నారని సమాచారం. కోవిడ్ నిబంధనల్లో భాగంగా వైద్యుల పర్యవేక్షణ, ఇతరత్రా వైద్య సిబ్బంది జాగ్రత్తల మధ్య హోస్ట్ నాగార్జునపై షూటింగ్ నిర్వహించారని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రియాల్టీ షో చేపట్టడం ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పక తప్పదు.