పవన్ కల్యాణ్ నష్టాన్ని ఎన్టీఆర్ భర్తీ చేశాడు

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో బాగా నచ్చిన సినిమా ఏది? నచ్చని సినిమా ఏది? ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాడు నిర్మాత నాగవంశీ. ఆ బ్యానర్ లో అల వైకుంఠపురములో సినిమా…

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో బాగా నచ్చిన సినిమా ఏది? నచ్చని సినిమా ఏది? ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాడు నిర్మాత నాగవంశీ. ఆ బ్యానర్ లో అల వైకుంఠపురములో సినిమా అంటే తనకు బాగా ఇష్టమని, ఇక అజ్ఞాతవాసి సినిమా తనను బాగా ఇబ్బంది పెట్టిందని చెప్పుకొచ్చాడు.

“కొన్ని ఛాలెంజింగ్ మూమెంట్స్ ఉంటాయి కానీ బయటకు చెప్పుకోలేం. చాలా ఉంటాయి. మోస్ట్ ఛాలెంజింగ్ మూమెంట్ మాత్రం అజ్ఞాతవాసి. ఆ సినిమా జనవరిలో రిలీజైంది. దాన్నుంచి బయటకు రావడానికి మా అందరికీ 2 నెలలు పట్టింది. చాలా ఇబ్బందిలో ఉన్న టైమ్ లో తారక్ అన్న చాలా హెల్ప్ చేశాడు. ఆ దెబ్బ నుంచి మమ్మల్నందర్నీ బయటకు తెచ్చాడు. అదే ఏడాది హిట్ కొట్టి చూపిద్దామంటూ ఎంకరేజ్ చేశాడు.”

అలా అరవిందసమేత సినిమాతో కొంత తేరుకున్నామని తెలిపాడు నాగవంశీ. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మ్యాడ్ అనే సినిమా నిర్మించాడు ఈ నిర్మాత. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా మరోసారి మీడియా ముందుకొచ్చిన నాగవంశీ, గుంటూరుకారం ప్రాజెక్టు నుంచి పూజాహెగ్డే తప్పుకున్న అంశంపై కూడా మట్లాడాడు. మీడియాలో ఇన్నాళ్లూ వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని, కేవలం కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేయలేక పూజాహెగ్డే తప్పుకుందని అన్నాడు.

వరుసపెట్టి సినిమాలు చేస్తున్న ఈ నిర్మాత, అన్ని కథల్ని తాను విననని చెబుతున్నాడు. తనకు ఓ టీమ్ ఉంది. కథలన్నీ వాళ్లు వింటారని, బాగుంటే అప్పుడు తను వింటానని తెలిపాడు. పెద్ద హీరోలు, డైరక్టర్ల కథలు మాత్రం తనే విని ఓకే చేస్తానని అంటున్నాడు.