దర్శకుడిగా తొలి సినిమా 2018లో. బన్నీ హీరోగా ' నాపేరు సూర్య' అంతకన్నా ముందే కృష్ణారెడ్డి తీసిన వజ్రం సినిమా గుర్తుకు వచ్చేలాంటి కథ తో తయారైన ఆ సినిమా బన్నీకి ఓ పీడకల. భయంకర డిజాస్టర్. మళ్లీ ఇన్నాళ్ల తరువాత మెగా ఫోన్ పట్టుకునే అదృష్టం దక్కింది.
తొలి సినిమా చేసిన నాలుగేళ్ల తరువాత నితిన్ హీరోగా సినిమాకు క్లాప్ పడింది. అయితే షూట్ ఇప్పుడే స్టార్ట్ కాదు. మరో రెండు మూడునెలలు పడుతుంది. ఈ సినిమాకు జూనియర్ అనే టైటిల్ ప్రచారం లో వుంది.
సినిమాలో నితిన్ సరసన శ్రీలీల నటిస్తున్న ఈ సినిమాకు సుధాకర రెడ్డి అండ్ అదర్స్ నిర్మాతలు. చాలా కాలం తరువాత హారిష్ జయ్ రాజ్ సంగీతం అందిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్.
ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమా చేస్తున్నారు నితిన్. ఆ సినిమా తరువాత వక్కంతం సినిమా పినిష్ చేస్తారు. ముహుర్తం షాట్ కు ఆదిత్య ఉమేష్ గుప్త కెమేరా స్విచాన్ చేయగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.