Advertisement

Advertisement


Home > Movies - Movie News

నాలుగు కోట్లకు రిస్క్ చేస్తున్న నాగ్!

నాలుగు కోట్లకు రిస్క్ చేస్తున్న నాగ్!

ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో తను చేసిన ది ఘోస్ట్ సినిమా హిందీ విడుదల విషయంలో హీరో నాగార్జున కాస్త పెద్ద రిస్క్ నే చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా హిందీ విడుదల బాధ్యతను నాగ్ తన మీద వేసుకున్నారు. ఇక్కడే ఆయన కాస్త పెద్ద రిస్క్ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. విషయం ఏమిటంటే ది ఘోస్ట్ హిందీ శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ హక్కులు అన్నీ ఎప్పుడో అమ్మేసారు. ఇప్పుడు హీందీలో థియేటర్లలో విడుదల చేయాలంటే ఆ బయ్యర్ నే చేయాలి.

కానీ హిందీ బెల్ట్ లో థియేటర్లలో విడుదల చేయడం అంటే చిన్న విషయం కాదు. చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల ఆ రిస్క్ ఎందుకు తనకు అన్నది ఆ బయ్యర్ ఆలోచన. తను కూడా అంత రిస్క్ చేయలేనన్నది సినిమా నిర్మాత ఆలోచన. ఇలాంటి నేపథ్యంలో నాగ్ కనుక ఖర్చులు భరిస్తే తాను హిందీలో థియేటర్రలో విడుదల చేస్తానని, ఒక వేళ మంచి ఆదాయం వస్తే అప్పుడు ఖర్చులు ఇవ్వాల్సిన పని లేదనే విధమైన డిస్కషన్లు బయ్యర్ కు నాగ్ కు మధ్య జరిగినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఖర్చులు నాలుగు కోట్ల వరకు అవుతాయని అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఆదాయం రాకపోతే ఆ రిస్క్ తను భరిస్తా అని చెప్పి, నాగ్ సినిమాను హిందీ బెల్ట్ లో విడుదల చేయిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మాస్త్ర తరువాత నాగ్ హిందీ వాళ్లకు బాగానే పరిచయం అయ్యారు. ఆ ధీమాతోనే ఈ రిస్క్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ది ఘోస్ట్ సినిమాకు రెమ్యూనిరేషన్ కింది నాగ్ ఆంధ్రలో ని వైజాగ్, ఈస్ట్, వెస్ట్, గుంటూరు ప్రాంతాల హక్కులు తీసుకున్నారు. ఇవి డబ్బుల్లో లెక్కపెడితే సుమారు ఆరు కోట్లు వుంటుంది. సినిమా హిట్ అయితే అంతకన్నా ఎక్కువ వస్తే నాగ్ కు అంత రెమ్యూనిరేషన్ వచ్చినట్లు అన్నమాట. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?