Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలయ్య‌!

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలయ్య‌!

సినిమాలు, టాక్ షోలు, అప్పుడ‌ప్పుడు రాజ‌కీయ‌లు, కమర్షియల్ అడ్వర్టైజ్ మెంట్స్ చేస్తున్నా నంద‌మూరి బాలకృష్ణ మ‌రో కొత్త అవ‌తారం ఎత్తేందుకు సిద్ధ‌మాయ్యారు. తాజాగా క్రికెట్ కామెంటేట‌ర్ గా అవ‌తారం ఎత్తేందుకు బాల‌య్య సిద్ధ‌మాయ్యారు.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లో బాల‌య్య కామెంట‌రీతో అద‌ర‌గొట్ట‌నున్న‌ట్లు స్టార్ స్పోర్ట్స్ ప్ర‌క‌టించింది. మార్చి 31న ప్రారంభ‌మ‌య్యే ఐపీఎల్ ఓపెనింగ్ డే రోజు ఎంట‌ర్టెన్మెంట్ వేరే లెవెల్ లో ఉండ‌బోతుందంటూ ట్వీట్ చేసింది. బాల‌య్య లైవ్ లో ఎలా మాట్లాడుతారో ఎలాంటి కొత్త కొత్త ప‌దాలు మాట్లాడారో అని అంద‌రు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఇప్ప‌టికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు సర్వం సిద్ధమైంది. మార్చి 31న అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 16వ సీజన్ ఘనంగా ఆరంభం కానుంది. దాదాపు రెండు నెలల పాటు ఈ లీగ్ జరగనుంది. మే 28న జరిగే ఫైనల్ తో టోర్నీ ముగుస్తుంది. ఇక ఆరంభ మ్యాచ్ లో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?