ప్రకటనతో పాటు ఫస్ట్ లుక్ కూడా..!

నందమూరి అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. నందమూరి నటవారసుడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. Advertisement ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా పరిచయం…

నందమూరి అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. నందమూరి నటవారసుడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాతో మోక్షజ్ఞ సోదరి తేజశ్విని నిర్మాతగా పరిచయం అవుతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా లెజెండ్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించారు. ఈమెతో పాటు సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ సినిమా రాబోతోంది. ఇతిహాసాల్లోని పురాతన ప్రాంతాల్లోంచి ఉద్భవించిన సూపర్ హీరోగా మోక్షజ్ఞను చూపించబోతున్నాడు ప్రశాంత్ వర్మ. అంటే ఇది సోషియో ఫాంటసీ సినిమా అన్నమాట.

సినిమా ప్రకటనతో పాటు మోక్ష్ లుక్ ను కూడా విడుదల చేశారు. అతడ్ని స్టయిలిష్ గా ప్రజెంట్ చేశాడు దర్శకుడు. ఫస్ట్ లుక్ లో స్లిమ్ గానే ఉన్నాడు మోక్ష్.

ప్రస్తుతానికి సినిమాకు సంబంధించిన వివరాలివే. హీరోయిన్, మ్యూజిక్ డైరక్టర్ వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారు. అన్నట్టు ఈ సినిమాలో బాలకృష్ణ ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

13 Replies to “ప్రకటనతో పాటు ఫస్ట్ లుక్ కూడా..!”

  1. స్వర్ణోత్సవం కాదు ఏకంగా ప్రేక్షకులకు పెద్దమొత్తంలో బొ. ..క్క పెట్టే దాకా ఊరుకునేది ledemo?

  2. ఈ ఫోటో మళ్లీ చూస్తే తెలిసింది, డైరెక్టర్ హింట్ ఇచ్చాడు, పారిపోండి అని, background లో అందరూ లగెత్తుతున్నారు.

  3. నిర్మాత సొంత వాళ్ళే ఐతే సరే. వేరే వాళ్ళకి నష్టం వుండదు.

    సొంత డబ్బుతో ఎన్ని సినిమాలు అయిన తీసు కొండి, ఎవరు వద్దు అనరు

Comments are closed.