తెలంగాణ ఉద్య‌మ‌కారుడు జిట్టా మృతి!

తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాల‌కృష్ణారెడ్డి (52) అనారోగ్యంతో శుక్ర‌వారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు విషాదంలో మునిగాయి. బ్రెయిన్ ఇన్‌ఫెక్ష‌న్‌తో బాధ‌ప‌డుతూ హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో రెండు…

తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాల‌కృష్ణారెడ్డి (52) అనారోగ్యంతో శుక్ర‌వారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు విషాదంలో మునిగాయి. బ్రెయిన్ ఇన్‌ఫెక్ష‌న్‌తో బాధ‌ప‌డుతూ హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో రెండు నెల‌లుగా ఆయ‌న చికిత్స తీసుకుంటున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న కోలుకోలేక‌… ఇవాళ ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణ కోసం ఉద్య‌మించిన నాయ‌కుల్లో జిట్టా ప్ర‌ముఖంగా నిలిచారు. అప్ప‌ట్లో ఆయ‌న టీఆర్ఎస్‌లో చేరారు. ఆ త‌ర్వాత కేసీఆర్‌తో విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌లేదు. దీంతో వైఎస్సార్ మ‌ర‌ణానంత‌రం ఆయ‌న త‌న‌యుడు స్థాపించిన వైసీపీలో చేరారు. ఆ పార్టీ తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా నిర్ణ‌యం తీసుకోవ‌డంతో వీడారు. సొంతంగా పార్టీని స్థాపించారు.

అనంత‌రం మ‌ళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీని కాద‌నుకుని బీజేపీలో చేరారు. కొంత కాలం కొన‌సాగారు. మ‌ళ్లీ ఆ పార్టీని విడిచి 2023 ఎన్నిక‌ల స‌మ‌యంలో తిరిగి బీఆర్ఎస్‌లో చేరారు. బీఆర్ఎస్ నాయ‌కుడిగానే చ‌నిపోయారు. భువ‌న‌గిరికి ఆయ‌న పార్థివ‌దేహాన్ని త‌ర‌లించారు. జిట్టా మృతికి ప‌లు పార్టీల నాయ‌కులు సంతాపం ప్ర‌క‌టించారు.

2 Replies to “తెలంగాణ ఉద్య‌మ‌కారుడు జిట్టా మృతి!”

Comments are closed.