విజయోత్సవం సరే…

విజ‌యోత్సవం ఎప్పుడు చేస్తారు. సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయినపుడు. కానీ బయ్యర్లు ఇంకా సేఫ్ కాకుండానే విజ‌యోత్సవం చేసేసారు సరిపోదా శనివారం సినిమాకు. చాలా ఉత్సాహంగా జ‌రిపారు. Advertisement నాని సూపర్ డూపర్…

విజ‌యోత్సవం ఎప్పుడు చేస్తారు. సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయినపుడు. కానీ బయ్యర్లు ఇంకా సేఫ్ కాకుండానే విజ‌యోత్సవం చేసేసారు సరిపోదా శనివారం సినిమాకు. చాలా ఉత్సాహంగా జ‌రిపారు.

నాని సూపర్ డూపర్ ఉల్లాసంగా వున్నారు. నాని సినిమాలకు అదృష్టం ఏమిటంటే సగటున వీలయినంత మంచి సమీక్షలు వస్తాయి. ఓవర్ సీస్, నైజాం, విశాఖ లాంటి అర్బన్ ఏరియాల్లో కలెక్షన్లు కనిపిస్తాయి. దాంతో బ్లాక్ బస్టర్ అనే ప్రచారం జ‌రిగిపోతుంది. కానీ బయ్యర్లు సేఫ్ కారు. దసరా సినిమాకు నైజాం మినహా మిగిలిన బయ్యర్లు అంతా నష్టపోయారు. అంటే సుందరానికి సినిమాకు డబ్బులు వెనక్కు ఇచ్చారు.

సరిపోదా శనివారం రన్ ఇంకా వుంది. 27 వరకు పెద్ద సినిమా ఏదీ లేదు. కానీ వీక్ డేస్ లో అస్సలు కలెక్షన్లు రాలడం లేదు. ఇప్పటి వరకు ఓవర్ సీస్, హైదరాబాద్ మంచి ఫలితాలు నమోదు చేసింది. విశాఖ కాస్త ఓకె. మిగిలిన ఏ ఒక్క ఏరియా కూడా ఇంకా బ్రేక్ ఈవెన్ వరకు రాలేదు. తరువాత ఖర్చులు, కమిషన్లు. ఈ శని,అదివారాలు కలెక్షన్లు వుంటాయని బయ్యర్లు నమ్ముతున్నారు. అలా వుంటే కాస్త దగ్గరకు చేరతారు. అది కూడా జీఎస్టీ ఇవ్వాల్సి వుంటుంది.

గోట్ సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన జ‌నం ఈ సినిమాకే వస్తారనే గ్యారంటీ లేదు. అ విషయం ఈ వీకెండ్ లో అటో ఇటో తెలిసిపోతుంది. వచ్చే వారం మంచి ప్రామిసింగ్ సినిమాలు వున్నాయి. ఈ వీకెండ్ కనుక సరిపోదా శనివారం సినిమా గట్టిగా ఫేర్ చేయకపోతే ఇక కష్టమే విజ‌యోత్సవం చేసి.

18 Replies to “విజయోత్సవం సరే…”

  1. పెద్ద హీరోల సినిమా లకే దిక్కులేదు

    ఈ బుడ్డోళ్ల సినిమా లు ఏమి చూస్తారు

  2. ఈ గొప్ప ఆంధ్ర గాడు వైసీపీ ఉంపుడు గత్తె . పవన్ కి దగ్గర ఉంటే వాళ్ళు ని తగ్గించి ఉంటాడు జగన్ గాడు నీ పైకి లేపుతు ఉంటాడు

Comments are closed.