ఆశపడితే.. బతుకు బస్టాండేనా?

తెలుగుదేశమే ముందు వారికి ఆశ పెడుతోంది, ప్రలోభ పెడుతోంది. తీరా వైసీపీకి రాజీనామా చేసేసిన తర్వాత.. వారి గురించి పట్టించుకోవడం లేదని..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోయింది గనుక.. ఇక ఆ పార్టీలో ఉండడం అనవసరం అని, తమ తమ తక్షణ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం అధికార పార్టీలో చేరిపోతే మంచిదని భావించే వారికి ప్రస్తుత పరిణామాలు షాకింగ్ గా కనిపిస్తున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించి వచ్చే వారికి ఆశ పెట్టడం, ప్రలోభాలు చూపించడం, తాయిలాలు ప్రకటించడం వంటివి కూటమి పార్టీ నేతలు బాగానే చేస్తున్నారు. కానీ.. ఒకసారి ఆ పార్టీకి రాజీనామా చేసేసిన తర్వాత.. ఇక పట్టించుకోవడం లేదు. వారిని త్రిశంకుస్వర్గంలో ఉంచేస్తున్నారు. వారి పరిస్థితి ఎటూ కాకుండా పోతోంది. కూటమి పార్టీల ఆఫర్లకు ఆశపడితే.. ఇక బతుకు బస్టాండేనా అనే అభిప్రాయం వారిలో కలుగుతోంది.

ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిన వారు పలువురు ఉన్నారు. వీరు ఏ పార్టీలో చేరబోతున్నారు అనేది ఇంకా క్లారిటీ రావడం లేదు. అవతల ఆయా పార్టీలు వీరిని చేర్చుకోవడానికి రెడ్ కార్పెట్ వేస్తున్నాయా? లేదా బారికేడ్లు పెడుతున్నాయా? అనే క్లారిటీ కూడారావడం లేదు.

పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేయడానికి ముందే తెలుగుదేశంలో చేరబోతున్నట్టుగా ప్రకటించారు. గతంలో ఆమె ఆ పార్టీ నుంచే వైసీపీలోకి వెళ్లారు. చంద్రబాబును తీవ్రస్థాయిలో తూలనాడారు కూడా. తిరిగి ఇప్పుడు తెదేపా అంటున్నారు. కాకపోతే ఆమె ఎంట్రీకి లోకల్ గా సొంత నియోజకవర్గంలో తెదేపా నేతలు అభ్యంతరం చెబుతున్నట్టు సమాచారం.

ఇన్నాళ్లూ పార్టీ నేతలను వెంటాడిన, దూషించిన పోతుల సునీత ఇప్పుడు అవకాశవాదంతో మళ్లీ పార్టీలోకి వస్తానంటే చేర్చుకోవద్దని వారు మొండికేస్తున్నారు. దాంతో ఇది వరకు ఆమె చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు కూడా సొంతపార్టీలో ముసలం పుట్టకుండా ఇప్పుడు పునరాలోచనలో ఉన్నట్టు సమాచారం. తెలుగుదేశంతో బేరాలాడుకుని, చేరికకు ఓకే అనిపించుకున్న అనేక మంది నాయకుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

తెలుగుదేశమే ముందు వారికి ఆశ పెడుతోంది, ప్రలోభ పెడుతోంది. తీరా వైసీపీకి రాజీనామా చేసేసిన తర్వాత.. వారి గురించి పట్టించుకోవడం లేదని.. లోకల్ లీడర్లలో వ్యతిరేకత పేరుతో నాటకాలాడుతున్నారని కొన్ని విమర్శలున్నాయి. తెదేపా వ్యవహార సరళిలో.. ఆ నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం కంటె, వైసీపీలో లేకుండా చేయడమే ప్రధానాంశంగా ఉన్నట్టు తెలుస్తోంది.

9 Replies to “ఆశపడితే.. బతుకు బస్టాండేనా?”

  1. areye babu neeku ardham kaanidhi yemitante YCP nayakulu memu YCP ki raajeenaama chesi bayataki vasthaamu mammlni TDP loki cherchukoka poyina farvaaledhu kaane kesulu, arestulu cheya vaddhu ani bathimaalukuni YCP ki good bye chebuthunnaru….

  2. బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాం, . కానీ 75 సంవత్సరాలు గా మన ఆంధ్రా లో రోజు రోజుకీ పెరిగి పోతున్న న గడ్డి ?: –

    1 బెజవాడ గోపాలరెడ్డి

    2 నీలం రెడ్డి -2

    3 కాసు రెడ్డి – 2

    4 మర్రి రెడ్డి. -2

    5 భవనం రెడ్డి

    6 కోట్ల రెడ్డి

    7 నేదురు రెడ్డి

    8 … సందిట్లో కొజ్జా రెడ్డి

    9 నల్లారి రెడ్డి

    10 జైలు రెడ్డి (AP చరిత్ర లో మచ్చ) .

    . వీళ్లకి తోడు బరితెగించిన

    1. శ్రీ రెడ్డి

    2 రోజా రెడ్డి ( శ్రీ లతా రెడ్డి)

    3. శ్యామలా రెడ్డి (పావలా శ్యామల,)

Comments are closed.