బయటకొస్తున్నాడు.. ఇక పోరు బాటేనట !

మాజీ సీఎం అండ్ గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ మౌనం వీడి గుహ (ఫామ్ హౌజ్ ) నుంచి బయటకు వస్తున్నాడు. వినాయక చవితి వెళ్ళగానే పోరు బాట పట్టబోతున్నాడు. 10 గానీ 11…

మాజీ సీఎం అండ్ గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ మౌనం వీడి గుహ (ఫామ్ హౌజ్ ) నుంచి బయటకు వస్తున్నాడు. వినాయక చవితి వెళ్ళగానే పోరు బాట పట్టబోతున్నాడు. 10 గానీ 11 న గానీ యాక్షన్లోకి దిగుతాడని మీడియా సమాచారం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగిపారేస్తాడట. దుమ్ముదులుపుతాడట. వైఫల్యాలను ఎండగడతాడట. పాత కేసీఆర్ ను చూపిస్తాడట.

నీరసపడిన పార్టీలో జవసత్వాలు నింపుతాడని నాయకులు చెబుతున్నారు. పార్టీ బలోపేతం కోసం యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాడని చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నాయకులకు కూడా కేసీఆర్ అంత సులభంగా అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదని చెబుతారు. కానీ ఇకనుంచి అలా ఉండదని అంటున్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలల్లో ఆ ప్రభుత్వ వైఫల్యాలు ఏమిటో నాయకులు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారట. కేసీఆర్ యాక్షన్లోకి దిగడానికి ప్రధాన కారణం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు. అందులో సత్తా చూపకుంటే పార్టీ మరింత డౌన్ అవుతుంది. క్యాడర్ నీరసపడిపోతుంది.

ఆ ప్రమాదం నుంచి పార్టీ బయటపడాలంటే కేసీఆర్ యాక్షన్లోకి దిగాల్సిందే. ఆపరేషన్ షురూ చేయాల్సిందే. రాష్ట్రంలో ఉపద్రవాలు జరుగుతున్నా, దారుణాలు జరుగుతున్నా కేసీఆర్ బయటకు రావడంలేదని విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి.

ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే భారీ వర్షాలు కురిసి వరదలు వచ్చినప్పుడు, పెద్ద యాక్సిడెంట్లు జరిగి ప్రాణ నష్టం జరిగినప్పుడు కూడా కేసీఆర్ బయటకు రాలేదనే విమర్శలు ఉన్నాయి. అయినా ఆయన తీరులో మార్పు లేదు.

ఇప్పటికైనా స్థానిక లోకల్ బాడీస్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి బయటకు వస్తున్నాడు. కేసీఆర్ కనుక యాక్షన్లోకి దిగితే రేవంత్ రెడ్డికి కూడా (నోటికి ) బాగానే పని ఉంటుంది. ఇక రాష్ట్రంలో యుద్ధం మొదలవుతుంది.

20 Replies to “బయటకొస్తున్నాడు.. ఇక పోరు బాటేనట !”

  1. సన్నాసి kcr గాడు నోటి దురుసు తనం తో ప్రజలను రెచ్చ కొట్టి ఎదిగాడు ఇంత కాలం, ఇక kcr నోరు ఎత్తాడంటే ప్రజలే kcr కు గడ్డి పెడతారు, రేవంత్ అవసరలేదు.

Comments are closed.